
రాహుల్ గాంధీ.. తెలంగాణ పర్యటన రద్దు!
సాయంత్రం 5:30గంటల సమయంలో పార్టీ శ్రేణులతో హనుమకొండలో ఆయన భేటీ.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణకు విచ్చేస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆయన హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హనుమకొండకు రానున్నారు. సాయంత్రం 5:30గంటల సమయంలో పార్టీ శ్రేణులతో హనుమకొండలో ఆయన భేటీ కానున్నారు. ఆ తర్వాత రాత్రి 7:30 గంటల సమయంలో ఆయన వరంగల్ నుంచి తమిళనాడుకు రైలులో బయలుదేరనున్నారు. ఈ క్రమంలోనే ఆయన రైలులో విద్యార్థులతో కలిసి ప్రయాణించనున్నారు. ఢిల్లీ నుంచి చెన్నై వరకు ప్రయాణం చేస్తున్న విద్యర్థులతో కలిసి ఆయన వరంగల్ నుంచి చెన్నై వరకు వెళ్లనున్నారు. వారితో కలిసి పలు అంశాలపై ముఖాముఖి కానున్నారు రాహుల్ గాంధీ. దేశంలోని పరిస్థితులతో పాటు తమిళనాడులోని పరిస్థితులపై కూడా ఆయన చర్చించనున్నట్లు సమాచారం. రాహుల్ గాంధీ.. తెలంగాణ పర్యటనలో భాగంగా ఆయనను నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేలు కలవనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ.. కుల గణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై ప్రజల అభిప్రాయం తెలుసుకోనున్నట్లు సమాచారం. ఈ నివేదికలపై ప్రజలు ఏమనుకుంటున్నారు? వారు ఏమైనా మార్పులు కోరుకుంటున్నారా? వారు కోరుకునే మార్పులు సమంజమసేనా? నివేదికల్లో తప్పులున్నాయన్న ప్రతిపక్షాల ఆరోపణలు ఎంత వరకు నిజం? ఇలా అనేక అంశాలపై పార్టీ నేతలతో చర్చించడంతో పాటు ఈ నివేదికల అమలుపై ప్రజలు ఏమనుకుంటున్నారు అని కూడా ఆయన వ్యక్తిగతంగా తెలుసుకోనున్నారని తెలుస్తోంది. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో వరంగల్ ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ మళ్లించడానికి చర్యలు తీసుకుంటున్నారు. కాగా పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో తన తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నారు రాహుల్ గాంధీ.