‘రాహుల్ రాజీనామా చేస్తే బ్యాలెట్ విధానం తెస్తాం’
x

‘రాహుల్ రాజీనామా చేస్తే బ్యాలెట్ విధానం తెస్తాం’

వాళ్లు తెచ్చిన విధానాన్ని వాళ్లే వ్యతిరేకిస్తున్నారన్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు.


రాయబరేలి ఎంపీ పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేస్తే ఎన్నికలకు బ్యాలెట్ పేపర్ట విధానంలో నిర్వహిస్తామంటూ తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు ఈవీఎంల విధానాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ కదా అని ఆయన గుర్తు చేశారు. వాళ్లు తెచ్చిన విధానాన్ని వాళ్లే వ్యతిరేకిస్తున్నారిన చెప్పారు. దేశానికి ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీకి వ్యవస్థలపై నమ్మకం లేకపోవడం దురదృష్టకరమని రఘునందన్ వ్యాఖ్యానించారు. అయితే కొంత కాలంగా ఈవీఎంలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా ఇండి కూటమి పార్టీలన్నీ దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నాయి. ఈవీఎంలపై ప్రజలకు నమ్మకం లేదని, తాము సరైన బటన్ నొక్కినా ఓటుమాత్రం వేరే నేతకు పడుతుందని ఆందోళన చెందుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈవీఎంల ట్యాపరింగ్ అనుమానాలు అధికంగా ఉన్నాయని కూడా చెప్పారు. ఈ సందర్భంగానే ఈవీఎంలను తొలగించి బ్యాలెట్ బాక్స్‌ల పద్దతిన ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు.. స్పందించారు.

‘‘బ్యాలెట్ పేపర్‌ను కాదని ఈవీఎంల విధానంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. రాయ‌బరేలిలో రాహుల్ రాజీనామా చేయాలి. అప్పుడు బ్యాలెట్ ద్వారా ఎన్నిక నిర్వహిస్తాం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాకం గాంధీ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిస్తే.. ఈవీఎంలు సరిగ్గా పనిచేస్తున్నట్లు. కానీ ఇప్పుడు బీహార్‌లో వాళ్లు గెలిచే పరిస్థితి లేదు. అందుకే ఈవీఎంలు పనిచేయడం లేదని అంటున్నారు. ఈవీఎంలను తెచ్చిందే రాజీవ్ గాంధీ కదా. రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలిలో 2లక్షలకు పైగా ఓట్లు అనుమానంగా ఉన్నాయి. అక్కడ దొంగ ఓట్లతోనే రాహుల్ గెలిచారు.. కాబట్టి ఆయన ఎన్నికలు రద్దు చేయాలని మేము కోరబోతున్నాం’’ అని రఘునందర్ పేర్కొన్నారు.

‘‘అదే విధంగా బెంగాల్‌లో డైమండ్ హార్బర్ నియోజకవర్గం, ఉత్తర్‌ప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంపై అనుమానాలున్నాయి. వాటిని పరిశీలించాలని అధికారులను కోరతాం. వాళ్లు గెలిస్తే ఈవీఎంలు కరెక్ట్‌గా పనిచేసినట్లు. ఓడిపోతే ఈవీఎంలు సరిగాలేవని మిషన్‌లపై బురదజల్లి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ పార్టీ.. రాజ్యాంగాన్ని, న్యాయవ్యవస్థను గౌరవించడం లేదు. ఆరోపణలు చేసే ముందు వ్యవస్థలను శాస్త్రీయంగా అధ్యయనం చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలి. ఈవీఎంలను ట్యాంపర్ చేస్తే కేటీఆర్ ఎందుకు ఓడిపోయారు’’ అని ఆయన ప్రశ్నించారు.

Read More
Next Story