రాజీనామా ఆమోదంపై రాజాసింగ్ స్పందన
x

రాజీనామా ఆమోదంపై రాజాసింగ్ స్పందన

ఏ పదవి కోసం బిజెపిలో చేరలేదు


బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ తన పార్టీకి చేసిన రాజీనామాను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఆమోద ముద్రవేయడంతో ట్విట్టర్ వేదికగా స్పందించారు. గత నెల 30న రాజాసింగ్ పార్టీ అధ్యక్షుడైన కిషన్ రెడ్డికి తన రాజీనామా సమర్పించారు. కిషన్ రెడ్డి ఆ రాజీనామాను అధిష్టానానికి పంపించారు. పది రోజుల తర్వాత నడ్డా ఆ రాజీనామాకు ఆమోద ముద్ర వేస్తూ రాజాసింగ్ కు ఓ లేఖ రాశారు. మీ ఆరోపణలు పార్టీ సిద్దాంతానికి వ్యతిరేకంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

నడ్డా వ్యాఖ్యలకు రాజాసింగ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. హిందుత్వ పరిరక్షణ కోసమే తాను బిజెపిలో చేరానని చెప్పారు. ఏ పదవి, అధికారం కోసం తాను బిజెపిలో చేరలేదని, చివరి శ్వాస వరకు హిందుత్వం కోసం పోరాడుతానని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.

Read More
Next Story