‘కొందరు నేతలు శ్రీశైలంలో పాపాలు చేశారు’
x

‘కొందరు నేతలు శ్రీశైలంలో పాపాలు చేశారు’

ఆ క్షేత్రాన్ని కాపాడాల్సిన బాధ్యత పవన్, చంద్రబాబుకు కూడా ఉంటుందన్న రాజాసింగ్.


శ్రీశైలంలో అటవీశాఖ అధికారులపై ఎమ్మెల్యే దాడి చేసిన ఘటనపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఈ వ్యవహారంలో డిప్యూటీ సీఎం స్పందించిన తీరును ఆయన మంచి పరిణామంగా పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారులపై దాడి చేసిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌పై చర్యలు తీసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే రాజాసింగ్ స్పందించారు. పవన్ చాలా మంది నిర్ణయం తీసుకున్నారని, కానీ ఆయన ఇంకా చాలా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. పవన్ తన ట్వీట్‌తో ప్రభుత్వ అధికారులపై దాడికి పాల్పడితే ఎవరిపైన అయినా చర్యలు ఉంటాయన్న గొప్ప సందేశాన్ని ఇచ్చారని రాజాసింగ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగానే శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని కాపాడే బాధ్యత ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంపై ఉందని సూచించారు. ఆ ఆలయంలో చాలా ఘోరాలు జరుగుతున్నాయనిన్నారు. శ్రీశైలం విశిష్టతను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, కానీ కొందరు రాజకీయ నాయకులు గతంలో అక్కడ అనేక పాపాలు చేశారని వ్యాఖ్యానించారు రాజాసింగ్.

‘‘శ్రీశైలం పవిత్ర స్థలం కానీ ఈ పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేయడానికి చాలాకాలంగా కుట్రలు జరుగుతున్నాయి. తమ ఓటు బ్యాంకు కోసం కొన్ని ప్రభుత్వాలు శ్రీశైలంలో ముస్లింలు, క్రైస్తవులను స్థిరపరిచాయి. ఆ ప్రాంతాంలోని దాదాపు అన్ని దుకాణాలను ముస్లింలు, క్రైస్తవులు ఆక్రమించారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కు ఈ విషయం తెలుసా.. లేదా? వారికి తెలిస్తే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? వారిని అక్కడి నుంచి ఎందుకు తొలగించడం లేదు? ఈ సమస్యను పరిష్కరించాలని చంద్రబాబు, పవన్‌ను అభ్యర్థిస్తున్నాను. శ్రీశైలాన్ని ఆక్రమించిన వారందరినీ సున్నిపేట ప్రాంతానికి బదిలీ చేయాలని కోరుతున్నా’’ అని ఆయన తెలిపారు.

ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. అసలు ఆయన శ్రీశైలం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అని కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణలో సృష్టించిన విధంగానే ఆంధ్రలో కూడా మత వివక్షకు బీజం వేసేలా రాజాసింగ్ వ్యాఖ్యలు ఉన్నాయని, ఎవరూ ఒక్క ఆక్రమించుకుని అక్రమంగా ఉండటం లేదని పలువురు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి దారితీసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read More
Next Story