
ఛార్జ్ తీసుకున్న రామచందర్‌రావు..
రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఆయన తన శాయశక్తుల శ్రమిస్తానని తెలిపారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్ రామయందర్‌రావు బాధ్యతలు స్వీకరించారు. వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకుని ఆయన బాధ్యతల స్వీకరణ పత్రాలపై సంతకం చేశారు. అనంతరం ఉస్మానియా వర్సిటీలోని సరస్వతీ దేవాయంలో, ఛార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి ఆయన ర్యాలీగా అమరవీరుల స్థూపాన్ని సందర్శించారు. అక్కడ తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన వీరులకు నివాళులు అర్పించారు. వారి త్యాగాలను వృథా కానివ్వమని, వారి త్యాగాలకు న్యాయం చేసి.. వారి ఆశయాలను సాధించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ఆయన తన శాయశక్తుల శ్రమిస్తానని తెలిపారు. ఆయనతో పాటు ఈ ర్యాలీలో పార్టీ సీనియర్ నేత ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్ రావు కూడా పాల్గొన్నారు.
Next Story