సిఐడి విచారణకు హాజరైన రానా, విష్ణు ప్రియ
x
Vishnu priya and Actor Rana

సిఐడి విచారణకు హాజరైన రానా, విష్ణు ప్రియ

బెట్టింగ్ యాప్ కేసులో


బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో సినీ నటుడు రానా, యాంకర్ విష్ణు ప్రియ శనివారం సిఐడి విచారణకు హాజరయ్యారు. బ్యాంకు లావాదేవీలకు సంబంధించి డాక్యుమెంట్స్‌ను సిఐడి అధికారులకు సమర్పించారు. బెట్టింగ్ యాప్స్ తో కుదుర్చుకున్న ఒప్పందాలపై వీరిద్దరినీ సిఐడి అధికారులు ప్రశ్నించారు. ప్రమోషన్ ద్వారా వచ్చిన పారితోషికాలపై ప్రశ్నించారు.

తాజ్ 777 బుక్ డాట్ కామ్ సహా మరో రెండు బెట్టింగ్ యాప్స్‌ను యాంకర్ విష్ణు ప్రియ ప్రమోట్ చేశారు. 2017లో తాను గేమింగ్ యాప్ లను ప్రమోట్ చేయలేదని, కేవలం స్కిల్ బేస్‌డ్ యాప్ లను మాత్రమే ప్రమోట్ చేసినట్టు రానా అధికారులకు వివరించారు.

Read More
Next Story