మళ్ళీ కోర్టుకెళ్లిన జానీ మాస్టర్ బెయిల్.. ఈసారి పోలీసులే..!
x

మళ్ళీ కోర్టుకెళ్లిన జానీ మాస్టర్ బెయిల్.. ఈసారి పోలీసులే..!

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ వ్యవహారం మరోసారి కోర్టుకెళ్లింది. ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు కోర్టును ఆశ్రయించారు.


ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ బెయిల్ వ్యవహారం మరోసారి కోర్టుకెళ్లింది. ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. రంగారెడ్డి పోలీసులు దాఖలు చేసిన ఈ పిటిషన్‌తో ఆయన బెయిల్ విషయం మరోసారి డైలమాలో పడింది. జాతీయ అవార్డు తీసుకోవడం కోసం నాలుగు రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న జానీ మాస్టర్ అభ్యర్థనను రంగారెడ్డి కోర్టు అంగీకరించింది. ఈనెల 10న కోర్టు ముందు హాజరుకావాలని జానీ మాస్టర్‌ను ఆదేశించింది. కాగా ఇప్పుడు ఆయనకు ఆ జాతీయ అవార్డును రద్దయిన నేపథ్యంలో ఆయనకు మంజూరు చేసిన బెయిల్‌ను కూడా క్యాన్సిల్ చేయాలంటూ రంగారెడ్డి పోలీసులు కోర్టును ఆశ్రయించారు. అవార్డు అందుకోవడం బెయిల్‌ను మంజూరు చేయడం జరిగిందని, ఇప్పుడు అవార్డే రద్దయిన సందర్భంగా ఆయన బెయిల్‌ను కూడా రద్దు చేయాలని పోలీసులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా ఈ పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది.

అవార్డు ఎందుకంటే..

తిరు సినిమాలోని మేఘం కరుగత పాట కొరియోగ్రఫీకి గానూ జానీ మాస్టర్‌ నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు. 2022కుగాను 70వ జాతీయ అవార్డుల్లో జానీకి ఈ పురస్కారాన్ని అందించనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వెలలడించింది. అయితే ఇప్పుడు ఆయనపై ఆయన అసిస్టెంబ్ ఒకరు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ కేసు నమోదు చేయడం, ఆ కేసులో భాగంగా ఆయన జైల్లో ఉండటంతో ఈ పురస్కారాన్ని రద్దు చేశారు. ఆయనపై పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు కావడం ఈ అవార్డు రద్దులో కీలకంగా మారింది. అయితే జానీ మాస్టర్‌కు అవార్డును నిలిపివేయడంపై పలువురు డ్యాన్స్ మాస్టర్లు స్పందిస్తున్నారు. తాజాగా ఈ విషయం తనకు చాలా బాధ కలిగించిందని ఆట సందీప్ చెప్పుకొచ్చాడు.

అందుకే ఇంతకాలం మాట్లాడలేదు: సందీప్

‘‘జానీ మాస్టర్‌కు నేషనల్ అవార్డు రద్దు అయిందని సోషల్ మీడియా ద్వారా తెలిసింది. తెలియగానే చాలా బాధగా అనిపించింది. ఓ ఆడపిల్ల విషయం, సెన్సిటివ్ అని ఇంతకాలం సైలెంట్‌గా ఉన్నా. వాళ్లకి వాళ్లకి ఏదో ఉండొచ్చు. జానీ మాస్టర్ లీగల్‌గా ప్రొసీడ్ అవుతారని అనుకున్నా. కానీ ఈరోజు వచ్చిన జాతీయ అవార్డు క్యాన్సిల్ చేసే రేంజ్‌కు వెళ్లిందంటే చాలా బాధపడుతున్నా’’ అని సందీప్ అన్నారు. ఏది ఏమైనా అవార్డును వెనక్కు తీసుకోవడం ఏమాత్రం సరైన పని కాదంటూ వారు జానీ మాస్టర్‌కు మద్దతుగా నిలిచారు.

అసలు జానీ మాస్టర్‌పై ఏమని కేసు నమోదైంటే..

అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న మహిళ జానీ మాస్టర్‌పై ఫిర్యాదు చేశారు. చెన్నై, ముంబై, హైదరాబాద్ సహా పలు ఇతర ప్రాంతాల్లో ఔట్ డోర్ షూటింగ్ వేళల్లో, నార్సింగిలోని నివాసంలో కూడా పలు సార్లు తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని, ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడని సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా నో అంటే టాలీవుడ్ డ్యాన్సర్ యూనియన్‌కు అధ్యక్షుడిగా ఉన్న అధికారంతో అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనపై లైంగిక దాడి నార్సింగిలో జరిగిందని సదరు మహిళ ఆరోపించడంతో ఈ కేసును నార్సింగికి బదిలీ చేశారు. కాగా జానీ మాస్టర్‌పై ఐపీసీ సెక్షన్స్ 376, 506, 232(2) కింద కేసు నమోదు చేశారు. అనంతరం జానీ మాస్టర్ కోసం గాలింపులు ప్రారంభించి. జానీని పోలీసులు బెంగుళూరు/గోవాలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అనతరం కోర్టు ముందు హాజరుపరచగా అతడిని న్యాయస్థానం రిమాండ్‌కు తరలించింది.

Read More
Next Story