తెలంగాణ షూటర్ కు అరుదైన గౌరవం
x
Telangana Pride

తెలంగాణ షూటర్ కు అరుదైన గౌరవం

డెప్లంపిక్స్ 10 మీటర్ల రైఫిల్ విభాగం ఫైనల్లో అత్యధిక పాయింట్లు సాధించిన షూటర్ ధనుష్ కు కోటి 20 లక్షల నజరానా


టోక్యో వేదికగా జరుగుతున్న డెప్లంపిక్స్ లో హైదరాబాద్ కు చెందిన షూటర్ కు అరుదైన గౌరవం దక్కింది. పది మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో ధనుష్ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో 252.2 పాయింట్లతో ధనుష్అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో డెప్లంపిక్స్ 10 మీటర్ల రైఫిల్ విభాగం ఫైనల్లో అత్యధిక పాయింట్లు సాధించిన షూటర్ గా ప్రపంచరికార్డుల్లో కెక్కారు. సూరత్ కు చెందిన మరో షూటర్ మహమ్మద్ వానియా 250. 1 పాయింట్లతో రజత పతకం సాధించాడు. దీంతో రెండు పతకాలు భారత్ కే దక్కినట్లయ్యింది.


ఇక ఈ డెప్లంపిక్స్ లో సత్తా చాటిన ధనుష్ కు తెలంగాణ సర్కారు భారీ నజరానా ప్రకటించింది. స్పోర్ట్స్ పాలసీ ప్రకారం కోటి 20 లక్షల రూపాయల నగదు ఇవ్వనున్నట్టు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. హన్మకొండ స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభోత్సవంలో మంత్రి ఈ విషయం వెల్లడించారు.

Read More
Next Story