అరుదైన పాంగోలిన్ స్కేల్ స్వాధీనం
x

అరుదైన పాంగోలిన్ స్కేల్ స్వాధీనం

వన్య ప్రాణి సంరక్షణా చట్టం క్రింద నలుగురు నిందితులపై కేసులు నమోదు


అరుదైన పాంగోలిన్ స్కేల్ ను డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ హన్మకొండలో ఈ అరుదైన పాంగోలిన్ స్కేల్ 6.53 కిలోల బరువు ఉంది. ఇవి భారతీయ పాంగోలిన్ నుంచి సేకరించిన పొలుసులు. వన్యప్రాణి సంరక్షణా చట్టం క్రింద పాంగోలిన్ స్కేల్ వ్యాపారం చట్టవిరుద్దం. ఈ అక్రమ వ్యాపారం చేస్తున్న నలుగురునిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారత దేశానికి చెందిన పాంగోలిన్ స్కేల్ స్వాధీనమైనట్టు డిఆర్ఐ అధికారులు చెప్పారు. హైదరాబాద్ డిఆర్ఐ బృందానికి వచ్చిన సమాచారం మేరకు హన్మకొండలో మాటువేసి అ క్రమ వ్యాపారం చేస్తున్న నిందితులను అరెస్ట్ చేశారు.

పాంగోలిన్ ఒకరకమైన క్షీరదం. వీటి పొలుసులకు అంతర్జాతీయ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. సాంప్రదాయ చైనీస్ వైద్యంలో ఇది ప్రధాన ముడిసరుకు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అక్రమ రవాణా చేస్తున్న క్షీరదాల వ్యాపారంలో పాంగోలిన్ స్కేల్ అగ్రస్థానంలో నిలిచింది.

చైనా, అగ్నేసియా దేశాల్లో పాంగోలిన్ లను వేటాడుతుంటారు. వీటి విలువైన పొలుసుల కోసమే వేటాడుతుంటారు. పాంగోలిన్ స్కేల్ క్షీరదం ఎక్కువగా చెద పురుగులను తింటుంది.

Read More
Next Story