మానకొండూరులో రసమయి వర్సెస్ కవ్వంపల్లి రాసలీలలు
x

మానకొండూరులో రసమయి వర్సెస్ కవ్వంపల్లి రాసలీలలు

పోస్టర్ల వార్ తో హీటెక్కిన పాలిటిక్స్


కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో రాజకీయ వేడి పెరిగి పోయింది. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మధ్య పొలిటికల్ వార్ కు రాసలీలలు కేంద్రబిందువయ్యాయి. కామ లీలల కవ్వంపల్లి వాల్ పోస్టర్లు బిఆర్ఎస్ శ్రేణులు అంటిస్తే రాసలీలల రసమయి అని కాంగ్రెస్ పోస్టర్లు రిలీజ్ చేసింది. సోషల్ మీడియా వేదికగా రెండు పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇరు పార్టీలకు చెందిన నేతల రాసలీలల పోస్టర్లు మానకొండూరులో చర్చకు దారి తీసింది.

గుండ్లపల్లి నుంచి పొత్తురు వరకూ డబుల్ రోడ్ విషయంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మధ్య గత కొంత కాలంగా కాంట్రవర్సీ నడుస్తోంది. 'రోడ్డు ఇంకెప్పుడు పూర్తిచేస్తావ్?.. మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అంటూ పోస్టర్లు విడుదల చేశారు రసమయి బాలకిషన్. కమీషన్ల నారాయణ' అంటూ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు.

Read More
Next Story