హైదరాబాద్ లో  రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య
x

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందుల వల్ల అని సుసైడ్ నోట్


ఆర్థిక ఇబ్బందులతో మరో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నారు. హైద్రాబాద్ మీర్ పేట ప్రశాంత హిల్స్ కాలనీలో నివాసముండే బిల్డర్ మర్రి వెంకటేశ్వర్లు (47) భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఇటీవలె రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్పకూలడంతో వెంకటేశ్వర్లు ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారు. చనిపోయేముందు వెంకటేశ్వర్లు సుసైడ్ నోట్ రాసాడు. నేను ఆర్థిక ఇబ్బందుల వల్ల చనిపోతున్నాను నా మరణానికి ఎవరూ బాధ్యులు కాదు అని సుసైడ్ నోట్ లో పేర్కొన్నారు.వెంకటేశ్వర్లు భార్య ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఆర్థిక ఇబ్బందుల వల్ల తన భర్త డిప్రెషన్ కు గురై చనిపోయినట్టు భార్య చెబుతోంది.

Read More
Next Story