రేవంత్ సొంత జిల్లాలో రియల్ ఎస్టేట్ పతనం, కారణం ఏమిటంటే...
x

రేవంత్ సొంత జిల్లాలో రియల్ ఎస్టేట్ పతనం, కారణం ఏమిటంటే...

హైడ్రా కూల్చివేతల ప్రభావం హైదరాబాద్‌లోనే కాదు సీఎం సొంత జిల్లా మహబూబ్ నగర్‌లోని రియల్ ఎస్టేట్‌పై పడింది. ఈ ఏడాది ఆగస్టులో రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం తగ్గింది.


హైడ్రా ఆవిర్భవించాక చెరువులు, నాలాల్లో వెలసిన అక్రమ కట్టడాల కూల్చివేతలు యథేచ్ఛగా సాగిస్తోంది. గడచిన రెండు నెలల్లో హైదరాబాద్ పరిధిలోని 23 ప్రాంతాల్లో262 అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసి రియల్ ఎస్టేట్ డెవలపర్లు, భవనాల కొనుగోలు దారులను హడలెత్తిస్తోంది.

- హైడ్రా భవనాల వరుస కూల్చివేతల ప్రభావం తెలంగాణ సర్కారు ఆదాయంపై పడింది. గత ఏడాదితో పోలిస్తే హైదరాబాద్ నగరంతోపాటు సీఎం సొంత జిల్లా అయిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనూ రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా వచ్చిన ఆదాయం గణనీయంగా తగ్గింది. రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా వచ్చే ఆదాయం గత ఏడాది కంటే పెరగాల్సింది పోయి తగ్గడం విశేషం.

తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో చెరువుల్లో వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగించే లక్ష్యంతో చేపట్టిన హైడ్రా ఆపరేషన్ ఉమ్మడి మహబూబ్‌నగర్‌జిల్లాలోని రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. దీంతో పాలమూరు జిల్లాలో ఈ ఏడాది ఆగస్టు నెలలో ఆస్తుల రిజిస్ట్రేషన్లు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.తెలంగాణ రిజిస్ట్రేషన్ల శాఖ అందించిన అధికారిక సమాచారం ప్రకారం మహబూబ్‌నగర్‌లోని 12 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈఏడాది ఆగస్టు నెలలో 7,315 ఆస్తి రిజిస్ట్రేషన్‌న్లు జరిగాయి. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.19.31 కోట్ల ఆదాయం వచ్చింది.కానీ గత సంవత్సరం ఆగస్టు నెలలో 9,007 రిజిస్ట్రేషన్లు జరిగాయి.దీని ద్వారా గత ఏడాది ఆగస్టులో ప్రభుత్వ ఖజానాకు రూ.22.20 కోట్లు ఆదాయం వచ్చింది.గత ఏడాది కంటే ఈ ఏడాది ఆగస్టు నలలోనే రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గింది. హైడ్రా కూల్చివేతల డ్రైవ్‌ల వల్ల ఆదాయం తగ్గింది. హైడ్రా ప్రభావం వల్ల రియల్ ఎస్టేట్ రంగం ఢమాల్ అయింది.

అనిశ్చిత పరిస్థితులు...
హైడ్రా అక్రమ భవనాల కూల్చివేత ప్రయత్నాలు రియల్ ఎస్టేట్ రంగంలో అనిశ్చిత పరిస్థితులను సృష్టించాయి.హైదరాబాద్ నగరమే కాకుండా దీని ప్రభవం మహబూబ్‌నగర్ వంటి సమీప జిల్లాల్లో కూడా ఉంది. భవనాల కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు భవనాలు, ఫ్లాట్లు కొనేందుకు వెనుకాడుతున్నారు.హైదరాబాద్ అభివృద్ధి ప్రభావం గతంలో పరిసర ప్రాంతాల్లో ఉండేది. కానీ హైడ్రా కూల్చివేతల ప్రభావం ఇప్పుడు మొత్తం తెలంగాణ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ లావాదేవీల వేగం మందగించింది.మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా రియల్ రంగం స‌మ‌స్య‌ల్లో ఉండగా, హైడ్రా ఆప‌రేష‌న్ ప్ర‌భావం నుంచి పాలమూరు జిల్లా ఎలా కోలుకుంటుందో భవిష్యత్ కోసం వేచి చూడాల్సిందే.

హైడ్రా ఆపరేషన్‌తో ప్రజల్లో భయాందోళనలు
హైడ్రా ఆపరేషన్ ప్రభావం ప్రజల్లో భయాందోళనలకు దారితీసింది. దీనివల్ల హైదరాబాద్ ప్రాంతంలో ఆస్తి రిజిస్ట్రేషన్లు క్షీణించాయి. హైదరాబాద్ జిల్లాల్లో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం రూ.320 కోట్లు పడిపోయింది.హైదరాబాద్ జిల్లాలో రిజిస్ట్రేషన్ల సంఖ్యతోపాటు,వాటి ద్వారా ఆర్జించిన ఆదాయం రెండింటిలోనూ భారీ తగ్గింపు కనిపిస్తుంది.

జీహెచ్ఎంసీలో తగ్గిన రిజిస్ట్రేషన్లు
అధికారిక నివేదికల ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో ఈ ఏడాది జులై నెలలో 58,000 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అయితే ఆగస్టు నెలలో రిజిస్ట్రేషన్ల సంఖ్య 41,200కి పడిపోయింది. అంటే దాదాపు 17,000 రిజిస్ట్రేషన్లు తగ్గాయి.

తగ్గిన రిజిస్ట్రేషన్ల ఆదాయం
రిజిస్ట్రేషన్ల ఆదాయం క్షీణత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక చిక్కులు తీసుకువచ్చింది. ఈ ఏడాది జులై నెలలో ఈ రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.1,105 కోట్లు వచ్చింది. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఈ ఆదాయం రూ.320 కోట్లు తగ్గింది. ఆగస్టులో ఆదాయం రూ.785 కోట్లకు తగ్గింది.

హైడ్రా కూల్చివేతలే కారణమా?
హైడ్రా కూల్చివేతలే రిజిస్ట్రేషన్ల ఆదాయం భారీ క్షీణతకు కారణమని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. హైడ్రా వల్ల ఆస్తి కొనుగోలుదారులు,అమ్మకందారుల్లో అనిశ్చితి, భయం ఏర్పడింది. ఇలానే హైడ్రా భయాందోళనలు కొనసాగితే రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ ప్రాసెసింగ్‌లో జాప్యం
హైడ్రా ప్రభావం వల్ల ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ల ప్రాసెసింగ్ లో తీవ్ర జాప్యం జరుగుతోంది. లేఅవుట్‌లను క్రమబద్ధీకరించినప్పటికీ భవిష్యత్తులో ప్రభుత్వం తమపై చర్యలు తీసుకుంటుందనే భయంతో చాలా మంది ఉద్యోగులు భయపడుతున్నారు.ఎల్ఆర్ఎస్ ఆమోదించే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుంది.దీనివల్ల లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ దరఖాస్తులను ప్రాసెస్ చేయడంలో ఆలస్యం అవుతోంది.


Read More
Next Story