
కుషాయిగూడలో దారుణం..
రియల్‌ఎస్టేట్ వ్యాపారిని వెంటాడి హతమార్చిన దుండగులు.
కుషాయిగూడలో దారుణమైన ఘటన జరిగింది. శ్రీకాంత్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని కొందరు వ్యక్తులు వెంటబడి తరిమి తరిమి హతమార్చారు. రోడ్డుపై అందరూ చూస్తుండగానే వారు శ్రీకాంత్‌ను అతి కిరాకతంగా హతమార్చారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సీసీటీవీ కెమెరా రికార్డింగ్‌లు, స్థానికులు చెప్పిన వివారాల ప్రకారం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఆర్థిక పరమైన వివాదాలు, గొడవల కారణంగానే శ్రీకాంత్‌ను హతమార్చారా? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాంత్ కుటుంబీకులకు ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా శ్రీకాంత్‌కు ఎవరితోనైనా శత్రుత్వాలు, గొడవలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆయన కాంటాక్ట్స్ సహాయంతో దర్యాప్తును ముందుకు సాగిస్తున్నట్లు తెలిపారు. హత్య జరిగిన ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తును స్టార్ట్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.