హైదరాబాద్ లో రియల్టర్ హత్య
x
హైదరాబాద్ లో పట్టపగలు హత్య

హైదరాబాద్ లో రియల్టర్ హత్య

సినీఫక్కీలో వెంకటరత్నంను వెంబడించి కత్తులతో పొడిచి , తుపాకితో కాల్చి చంపిన దుండగులు


హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం సృష్టించింది. మల్కాజ్ గిరిలో జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు వెంకటరత్నం అనే రియల్టర్ ను కత్తులతో పొడిచి తుపాకీతో కాల్చి చంపారు. సాకేత్ కాలనీ పోస్టర్ స్కూల్ సమీపంలో స్కూటీపై వెళుతున్న వెంకటరత్నంను సినీ ఫక్కీలో వెంబడించి అతి కిరాతకంగా దుండగులు హత్య చేయడం కలకలం సృష్టించింది. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. వెంకటరత్నంపై పాతబస్తీ ధూల్ పేట పోలీస్ స్టేషన్ లో రౌడీషీట్ నమోదైనట్టు పోలీసులు గుర్తించారు. గతంలో జంట హత్యల కేసులో వెంకటరత్నం నిందితుడు అని పోలీసులు తెలిపారు. ఆయనను ప్రత్యర్థులే చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండ్రోజుల క్రితమే నగరపోలీస్ కమిషనర్ సజ్జనార్ 5,000 మంది పోలీసుల చేత నాకాబందీ నిర్వహించి రౌడీషీటర్లకు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నేరాలకు స్వస్తి పలకాలని చెప్పినప్పటికీ రియల్టర్ హత్యతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. శాంతి భధ్రతలు క్షీణిస్తున్నాయని చెప్పడానికి రియల్టర్ హత్య పరాకాష్ట అని పలువురు భావిస్తున్నారు.

Read More
Next Story