BRS BSP Alliance
x

బీఆర్ఎస్, బీఎస్పీ ఎన్నికల పొత్తు వెనుక అసలు రహస్యం ఏంటి?

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తాను తిట్టిన తిట్లనీ మర్చి పోయి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్నేహ హస్తం అందుకున్నారు.


రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరుగా. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కేసీఆర్, బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షులు ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ లు రాజకీయ స్నేహ హస్తము అందుకున్నారు. బిఆర్ ఎస్ పార్టీని, దాని అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ని కెసిఆర్ ఎపుడూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే, ప్రవీణ్ కుమార్ మాత్రం కెసిఆర్ ను కులం దగ్గిర నుంచి రాజకీయాల దాకా విపీతంగా విమర్శిస్తూ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో క్యాంపెయిన్ చేశారు. అలాంటి వ్యక్తి ఉన్నట్లుండి కెసిఆర్ ఇంట్లో ప్రత్యక్షం కావడం, లోక్సభ ఎన్నికలకు పొత్తు పెట్టుకోవడం చకాచకా జరిగిపోయాయి. ప్రతిపదన ఎవరి వైపు నుంచి వచ్చిందో గాని, కెసిఆర్, ప్రవీణ్ కుమార్ చేతులు కలిపారు.


దీని పై కొందరు రాజకీయ నాయకులు విస్మయం వ్యక్తం చేయగా, మరికొందరు ఇది కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ఎత్తుగడగా అభివర్ణిస్తున్నారు.

దీని వెనక కెసిఆర్ దీర్ఘాలోచన ఉందని బీఆర్ఎస్ నాయకుడొకరు చెప్పారు.

"కేవలం రెండు శాతం ఓట్ల తేడాతోనే బీఆర్ఎస్ 2023 శాశన సభ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. రాష్ట్ర ఓటర్లలో దళితులు 17 శాతం. దళిత బంధు వంటి స్కీంలు ఎన్నికల్లో ఓట్ల తేవని హుజురాబాద్ ఉప-ఎన్నికలు, ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టం అయ్యింది. ప్రజలలో గుర్తిపు ఉన్న ప్రవీణ్ కుమార్ నాయకునిగా బహుజన సమాజ్ పార్టీతో ఎన్నికల్లో లబ్ది పొందవచ్చని పార్టీ న్యాయకత్వం భావించి, బీఎస్పీ తో పొత్తు వైపు మొగ్గుచూపారు. రాష్ట్రం లోని మొత్తం 17 లోక్ సభ స్థానాలలో మూడు ఎస్సీ, రెండు ఎస్టీ రిజర్వుడ్ స్థానాలు. ప్రవీణ్ కుమార్, అతను స్థాపించిన రెసిడెన్షియల్ స్కూల్స్ పూర్వ విద్యార్థుల స్వేరోస్ సంస్థ, ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో రెండు నుంచి ఐదు శాతం ఓటర్ల పై ప్రభావం చూపవచ్చనే అంచనాతో బిఎస్పీతో పొత్తు పెట్టుకోవాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు,".అని ఆయన చెప్పారు.

బీఎస్పీ మాజీ నేత యతకుల సునీల్ మాట్లాడుతూ.. ప్రవీణ్ కుమార్ ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించిన తర్వాత తమ లాంటి అనేకమంది లీడర్లు పార్టీ వీడారు అని అన్నారు. బిఎస్పీతో పొత్తు బీఆర్ఎస్ కి ఎన్నికల్లో ఎలాంటి ప్రయోజనం ఉండదు. బీఆర్ఎస్ పై దొరల పార్టీ అనే ముద్ర పడింది. బీఎస్పీ తో పొత్తు తోనే దళిత ఓట్లు పొందవచ్చు అనుకుంటే అది భ్రమే అవుతుంది అని ఆయన అన్నారు.

బీఆర్ఎస్, బీఎస్పీ ఎన్నికల పొత్తుపై స్పందిస్తూ, రెండే కాదు, మూడు బి లు (బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ) లు కలిసినా వచ్చే లోక్ సభ న్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని రోడ్, భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పై గతంలో ప్రవీణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రజలు మర్చి పోలేదని చెప్పారు.

Read More
Next Story