
మాజీ సీఎస్ ఎస్ కె జోషికి హై కోర్టులో ఊరట
పిసీ ఘోష్ కమిషన్ నివేదిక ప్రకారం చర్యలు వద్దు
మాజీ ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి ఎస్ కె జోషికి హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణ చేపట్టిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ప్రకారం తనపై చర్యలు తీసుకోవద్దని ఎస్ కె జోషి హైకోర్టు నాశ్రయించారు. సాక్షిగా కేవలం తన వాంగ్మూలం మాత్రమే తీసుకున్న కమిషన్ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చర్యలకు ఉపక్రమించకూడదని ఎస్ కె జోషి హైకోర్టును అభ్యర్థించారు.
కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి అక్రమాలు జరిగినట్లు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతోంది. కమిషన్ 700 పేజీల నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే.
Next Story