డెడికేషన్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా రిటైర్డ్‌ ఐఎఎస్ వెంకటేశ్వరరావు
x

డెడికేషన్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా రిటైర్డ్‌ ఐఎఎస్ వెంకటేశ్వరరావు

తెలంగాణలో కులగణనకు డెడికేషన్‌ కమిషన్‌ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌ చైర్మన్‌గా రిటైర్డ్‌ ఐఎఎస్ అధికారి బుసాని వెంకటేశ్వరరావును నియమించారు.


కులగణనకు డెడికేషన్‌ కమిషన్‌ డెడికేషన్‌ కమిషన్‌ చైర్మన్‌గా రిటైర్డ్‌ ఐఎఎస్ అధికారి బుసాని వెంకటేశ్వరరావును,సెక్రటరీగా ఐఎఫ్ఎస్ అధికారి సైదులును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జీఓఎంఎస్ నంబరు 49 ను విడుదల చేసింది. కులగణనపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం డెడికేషన్‌ కమిషన్‌ ను ఆదేశించింది.హైకోర్టు ఆదేశాలతో ఈ కమిషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు జీఓలో సర్కారు పేర్కొంది.


6నుంచి కుల ప్రాతిపదికన సర్వే
తెలంగాణలో ఈ నెల 6వతేదీ నుంచి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, కుల ప్రాతిపదికన సర్వే చేయనున్నారు. దీని కోసం ఉపాధ్యాయులను నియమించారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా కోర్టు తీర్పులను అనుసరించేలా ఈ సర్వే చేపట్టనున్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని నిర్నయించింది.


Read More
Next Story