
ఆర్‌జీవీపై రిటైర్డ్ ఐపీఎస్ కేసు..
వెబ్‌సిరీస్‌లో తన పేరు వాడారని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు.
సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ్‌పై మాజీ ఐపీఎస్ అధికారి అంజనా సిన్హా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఇటీవల తీసిన ఓ వెబ్‌సిరీస్‌లో తన అనుమతి లేకుండానే తన పేరు వినియోగించారంటూ అంజనా సిన్హా.. రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కాంట్రవర్సీకి కేరాఫ్‌గా ఉన్న ఆర్‌జీవీ చుట్టూ ఇప్పుడు మరో వివాదం అలుముకుంది. ఆయన ఏ సినిమా తీసినా అది వివాదానికి దారితీస్తోంది. ఆయన తీసే సినిమా వివాదానికి కారణమవుతుందా? లేదంటా వివాదంగా మారే అంశాన్నే ఆయన సినిమాగా తెరకెక్కిస్తున్నారా? అన్న చర్చ కూడా సినీ సర్కిల్స్‌లో జరుగుతోంది. ఇది వరకు తీసిన కొండా, వ్యూహం.. వంటి సినిమాలు భారీ వివాదాలకు దారితీశాయి. ఇప్పుడు ఇటీవల తెరకెక్కించిన ‘దహనం’ అనే వెబ్‌సిరీస్‌కు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పుడు ఈ వెబ్‌సిరీస్ మరో వివాదానికి దారితీసింది.
మావోయిస్టులపై తీసిన వెబ్‌సిరీస్‌లో అంజనా సిన్హా పేరు ప్రస్తావించారు. కాగా ఆమె చెప్పినట్లే కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినట్లు ఆర్‌జీవీ చెప్పుకొచ్చారు. దీనిపై అంజనా సిన్హా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన ప్రమేయం లేకుండానే తన పేరు వాడారని ఆమె పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ అంశంపై ఆర్‌జీవీ స్పందించలేదు. ఆయన దీనిపై ఎలా రియాక్ట్ అవుతారు? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉంది.
‘దహనం’ ఏంటంటే..
‘దహనం’ వెబ్‌సిరీస్.. ఆర్‌జీవీ నిర్మాతగా అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కింది. కమ్యూనిస్ట్ నేత హత్య, దానికి ఆ నేత కుమారుడు ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అన్న నేపథ్యంలో వెబ్‌సిరీస్ నడుస్తుంది. దివంగత పొలిటికల్ లీడర్ పరిటాల రవి కుటుంబ నేపథ్యం, అతడి తండ్రి శ్రీరాములు, సోదరుడు హరి జీవితాల ఆధారంగా రామ్‌గోపాల్‌వర్మ నిర్మించిన తాజా వెబ్‌సిరీస్ దహనం. అగస్త్య మంజు ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. అభిషేక్ దుహాన్, అభిలాష్ చౌదరి, అశ్వత్ కాంత్, నైనా గంగూలీ ఈ వెబ్‌సిరీస్‌లో కీలక పాత్రలను పోషించారు.