సింగరేణి కార్మికులకు రు. 796 కోట్ల బోనస్
x
Singareni

సింగరేణి కార్మికులకు రు. 796 కోట్ల బోనస్

సంస్ధలోని కార్మికులు, ఉద్యోగులకు రు. 796 కోట్లను బోనస్ ప్రకటించారు. గమనించాల్సిన విషయం ఏమిటంటే కాంట్రాక్టు కార్మికులకు కూడా ప్రభుత్వం బోనస్ ప్రకటించింది.


సింగరేణి కార్మికులకు రేవంత్ రెడ్డి తీపికబురు చెప్పారు. దసరా పండుగ సందర్భంగా తెలంగాణా కార్మికులు, ఉద్యోగులకు బోనస్ ప్రకటించారు. సంస్ధలోని కార్మికులు, ఉద్యోగులకు రు. 796 కోట్లను బోనస్ గా ప్రకటించారు. ఈసారి గమనించాల్సిన విషయం ఏమిటంటే కాంట్రాక్టు కార్మికులకు కూడా ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. ప్రతి కాంట్రాక్టు కార్మికుడికి యాజమాన్యం రు. 6 వేలు బోనస్ గా ప్రకటించింది. సింగరేణి లాభాల్లో 33 శాతాన్ని బోనస్ గా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.

రెగ్యులర్ ఉద్యోగులు, కార్మికులకు సగటున రు. 1.90 లక్షలు బోనస్ గా పంపిణీ చేయబోతున్నట్లు చెప్పారు. సింగరేణి లాభాల్లో ప్రతి కార్మికుడికి వాటాలుంటాయని రేవంత్ చెప్పారు. ఇపుడు ఇచ్చిన బోనస్ మొత్తం పోయిన ఏడాది ఇచ్చిన బోనస్ కన్నా 20 వేలు అధికం. తెలంగాణా సాధనలో సింగరేణి కార్మికులు, ఉద్యోగుల పాత్ర మరువలేనిదన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే హోలుమొత్తం మీద సమీపభవిష్యత్తులో సింగరేణి అస్తిత్వమే ప్రమాదంలో పడబోతోంది. కారణం ఏమిటంటే ఒకపుడు సింగరేణి ఆధ్వర్యంలో ఉండే బొగ్గు గనులను కేంద్రప్రభుత్వం లాగేసుకున్నది. విచిత్రం ఏమిటంటే బాగా లాభాలు సంపాదించిపెట్టే ఓపెన్ కాస్ట్ గనులను కేంద్రం లాగేసుకుంది. నష్టాలు వచ్చే అండర్ గ్రౌండ్ గనులు మాత్రం సింగరేణి దగ్గరే ఉన్నాయి.

అండర్ గ్రౌండ్ గనుల తవ్వకాల్లో వచ్చే నష్టాలను సింగరేణి యాజమాన్యం ఇప్పటివరకు ఓపెన్ కాస్ట్ గనుల్లో వచ్చే లాభాలతో భర్తీ చేసుకుంటోంది. ఇపుడు కార్మికులు, ఉద్యోగులకు బోనస్ పంపిణీ చేసినా ఓపెన్ కాస్ట్ గనుల్లో వచ్చే లాభాలే కారణం. ఇపుడున్న ఓపెన్ కాస్ట గనుల్లో బొగ్గు నిల్వలు మహాయితే మరో పదేళ్ళు వస్తాయంతే. ఈలోపు గనుక యాజమాన్యం కొత్త ఓపెన్ కాస్ట్ గనులను రెడీచేసుకోకపోతే సంస్ధ మనుగడ ప్రమాదంలో పడటం ఖాయం. సింగరేణి పరిధిలోని ఓపెన్ కాస్ట్ గనులను వేలంపాటల పరిధిలో నుండి తప్పించి మళ్ళీ సింగరేణికి దక్కేట్లుగా యాజమాన్యం చాలా ప్రయత్నాలే చేస్తున్నది. అయితే ఇప్పటివరకు ఏ ప్రయత్నమూ సానుకూలమైనట్లు కనబడటంలేదు. ఈమధ్యనే ఒరిస్సాలో ఒక ఓపెన్ గని సింగరేణికి సొంతమైంది. కాకపోతే ఎక్కడో ఒడిస్సాలో ఉన్న గని నుండి బొగ్గు తవ్వటం వేరు, సింగరేణి పరిధిలోనే అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఉన్న గనుల్లో నుండి బొగ్గు తవ్వుకోవటం వేరు. మరి సింగరేణి ప్రయత్నం ఏ మేరకు విజయవంతమవుతాయో చూడాలి.

Read More
Next Story