తెలంగాణాను తిరిగి తీసుకొచ్చిన  రేవంత్
x

తెలంగాణాను తిరిగి తీసుకొచ్చిన రేవంత్

ఇంతకీ విషయం ఏమిటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా ఒక ఉత్తర్వును(జీవో)ను జారీచేసింది.


చదవటానికి విచిత్రంగా ఉన్నా ఇదే నిజం. ఇంతకీ విషయం ఏమిటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా ఒక ఉత్తర్వును(జీవో)ను జారీచేసింది. అదేమిటంటే గడచిన పదేళ్ళుగా తెలంగాణా ప్రభుత్వం స్ధానంలో ‘తెలంగాణా స్టేట్’ అనుంది. తెలంగాణా ప్రాంతాన్ని వ్యవహారికంగా సమైక్య రాష్ట్రం నుండే తెలంగాణా అనేవారు. అలాంటిది 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి కేసీయార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణాను తెలంగాణా స్టేట్ గా మార్చారు. అప్పటివరకు అన్నీ ఫైళ్ళు, వాహనాలు, సర్క్యులర్లు, హోర్డింగులు తదితరాలన్నింటిలోను ఏపీ అనుండేది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీయార్ తెలంగాణా స్టేట్ అని మార్చారు. అందుకనే అన్నీరకాల కమ్యూనికేషన్లలో తెలంగాణా స్టేట్ అని మొదలైంది. ఈ ఎఫెక్టు ముఖ్యంగా వాహనాల రిజిస్ట్రేషన్ మీదపడింది.

ఎలాగంటే ఏపీ అని ఉండే వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేసులో తెలంగాణా స్టేట్ అని రిజిస్ట్రేషన్ చేయాలని కేసీయార్ ప్రభుత్వం జీవో జారీచేసింది. అయితే వాహనాలకు అప్పటికే ఉన్న ఏపీ రిజిస్ట్రేషన్ను తెలంగాణా స్టేట్ గా మార్చుకోవాల్సిన అవసరంలేదని మినహాయింపు ఇచ్చింది. దాంతో అప్పటినుండి తెలంగాణాలో ఏపీ రిజిస్ట్రేషన్ వాహనాలతో పాటు తెలంగాణా స్టేట్ అని రిజిస్ట్రేషన్ అయిన వాహనాలు కూడా కనబడుతున్నాయి. ఇపుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమిచేసిందంటే తెలంగాణా స్టేట్ ను మళ్ళీ తెలంగాణా(టీజీ)గా రివర్సు చేసింది. దీనివల్ల ఫైళ్ళు, సర్క్యులర్లు, వాహనాల రిజిస్ట్రేషన్లు, హోర్డింగులు లాంటివన్నీ తెలంగాణాగా మార్చుకోవాల్సొచ్చింది. తెలంగాణా స్టేట్ నుండి తెలంగాణాకు మారటానికి ప్రభుత్వం వారంరోజులు మాత్రమే గడువిచ్చింది.

రేవంత్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల తెలంగాణాలో ఇకనుండి మూడో రిజిస్ట్రేషన్ తో మరిన్ని వాహనాలు కనబడబోతున్నాయి. తెలంగాణా స్టేట్ కాస్త తెలంగాణాగా మారటంతో ఇకనుండి రిజిస్ట్రేషన్ చేసుకునే వాహనాలకు టీ అని మాత్రమే కనబడుతుంది. అంటే తెలంగాణాలో తిరిగే వాహనాల్లో కొన్నింటికి ఏపీ అని, కొన్నింటికి టీఎస్ అని ఇకనుండి టీ అని మూడురకాల రిజిస్ట్రేషన్లు కనబడబోతున్నాయి. కేసీయార్ అధికారంలోకి రాగానే తెలంగాణా స్టేట్ అని మార్చటాన్ని చాలామంది వ్యతిరేకించారు. అయితే ఆ వ్యతిరేకతను కేసీయార్ పట్టించుకోలేదు. అప్పట్లో తెలంగాణా స్టేట్ బదులు తెలంగాణా గవర్నమెంట్ అనే ఉంచమని ఎంతమంది అడిగినా అంగీకరించలేదు.

ఇపుడు తెలంగాణా స్టేట్ ప్లేసులో రేవంత్ తిరిగి తెలంగాణాను తీసుకొచ్చారు. వారం తర్వాత ఎక్కడచూసినా మళ్ళీ తెలంగాణా స్టేట్ అనికాకుండా తెలంగాణా అని మాత్రమే కనబడుతుంది. దీంతో రేవంత్ తెలంగాణాను మళ్ళీ తీసుకొచ్చినట్లయ్యింది. తెలంగాణా ను తెలంగాణా స్టేట్ గా మార్చటం చాలామందికి ఇష్టంలేకపోయినా చేసేదిలేక మౌనంవహించారు. అలాంటివారంతా ఇపుడు హ్యాపీగా ఫీలవుతారేమో.

Read More
Next Story