KTR New Name|కేటీఆర్ కు కొత్తపేరు పెట్టిన రేవంత్
x
Revanth and KTR

KTR New Name|కేటీఆర్ కు కొత్తపేరు పెట్టిన రేవంత్

తాను ఎందుకు ఫార్ములా కార్ రేసు గురించి మాట్లాడటంలేదో ట్విట్టర్ పిట్టకు తెలిసినా పదేపదే ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడంలో కుట్ర ఉందన్నారు.


బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా కొత్తపేరు పెట్టారు. ఇంతకీ ఆ కొత్తపేరు ఏమిటంటే ‘ట్విట్టర్ పిట్ట’ అని. అవును, ఫార్ములా ఈ కార్ రేసు(Formula Car Race)కు సంబంధించి రేవంత్(Revanth) కొన్ని ఆశక్తికరమైన విషయాలను అసెంబ్లీలో వివరించారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న నాలుగు రోజుల్లోనే ఎఫ్ఇఓ(ఫార్ములా ఈ ఆపరేషన్స్) సీఈవో తనను కలసినట్లు చెప్పారు. ‘మీరు ఊ అంటే చాలు మిగిలింది మేము చేసుకుపోతాం’ అని చెప్పారట. ఈ నేపధ్యంలోనే కేటీఆర్(KTR) ను ఉద్దేశించి రేవంత్ ట్విట్టర్(Twitter) పిట్ట అన్నారు. ఫార్ములా కార్ రేసులో అందరికీ తెలిసిన అవినీతి రు. 55 కోట్లయితే దోపిడీకి ప్లాన్ చేసిన మొత్తం రు. 600 కోట్లన్నారు.

అసెంబ్లీ భూభారతి అనే కొత్తవ్యవస్ధపై చర్చించాలని ప్రభుత్వం అనుకుంటే దాన్ని పడనీయకుండా బీఆర్ఎస్(BRS) సభ్యులు సభలో ఎంత రాద్దాంతంచేశారో అందరు చూసిందే అని రేవంత్ అన్నారు. సభలో ధరణి పోర్టల్(Dharani Portal) స్ధానంలో భూభారతి(Bhu Bharathi)ని తీసుకొద్దామని అనుకుంటే దానిగురించి ట్విట్టర్ పిట్ట ఎందుకు మాట్లాడటంలేదని నిలదీశారు. ప్రభుత్వం మీద ట్విట్టర్లో ఆరోపణలు చేస్తున్న కేటీఆర్ సభకు వచ్చి మాట్లాడితే సమాధానాలు చెప్పటానికి తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. ఫార్ములా కార్ రేసు అవినీతి గురించి మాట్లాడాలని ట్విట్టర్ పిట్ట పట్టుబట్టడంలో అర్ధంలేదన్నారు. ఎందుకంటే ఆ అంశాన్ని ఏసీబీ విచారణ చేస్తోందని, హైకోర్టులో కేటీఆరే స్వయంగా పిటీషన్ వేసినందున సభలో మాట్లాడటం కుదరదని రేవంత్ అన్నారు. కోర్టు, దర్యాప్తుసంస్ధల విచారణలో ఉన్నపుడు తానుమాట్లాడితే ప్రభావితంఅయ్యే అవకాశముంది అన్న ఒకే కారణంతో మాట్లాడటంలేదన్నారు.

తాను ఎందుకు ఫార్ములా కార్ రేసు గురించి మాట్లాడటంలేదో ట్విట్టర్ పిట్టకు తెలిసినా పదేపదే ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడంలో కుట్ర ఉందన్నారు. ఒక వ్యక్తికి సంబంధించిన ఫార్ములా కార్ రేసు గురించి అసెంబ్లీలో మాట్లాడాలా ? లేకపోతే రాష్ట్రంలోని ప్రజానీకం మొత్తానికి సంబంధించిన కొత్త వ్యవస్ధ ‘భూభారతి’ గురించి చర్చించాలా చెప్పమని స్పీకర్ ను రేవంత్ అడిగారు. ప్రతిరోజు ట్విట్టర్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు, విమర్శలు చేస్తు, పోస్టులు పెట్టుకుంటు కేటీఆర్ చివరకు ట్విట్టర్ పిట్ట అయిపోయినట్లు కేటీఆర్ ను ఉద్దేశించి రేవంత్ ఎద్దేవాచేశారు.

Read More
Next Story