రేవంత్ మహా ముదురని మరోసారి తేలిపోయింది
x
Revanth Reddy

రేవంత్ మహా ముదురని మరోసారి తేలిపోయింది

ఇదే ప్రశ్నను మీడియా మిత్రులు తిప్పించి మళ్ళించి మళ్ళీ మళ్ళీ అడిగారు. అయితే ఒకే ప్రశ్నను ఎన్నిసార్లు అడిగినా రేవంత్ మాత్రం తాపీగా ఒకే సమాధానమిచ్చారు.


ఏపీ ఎన్నికల్లో చంద్రబాబునాయుడు నాయకత్వంలోని ఎన్డీయే కూటమి అద్భుతమైన విజయం సాధించింది. ఆ నేపధ్యంలో హైదరాబాద్ లో మీడియా సమావేశంలో రేవంత్ కు ఒక ప్రశ్న ఎదురైంది. అదేమిటంటే....

ప్రశ్న : చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారానికి హాజరవుతారా ?

రేవంత్ సమాధానం : ఆహ్వానం అందితే హాజరవుతాను

ఇదే ప్రశ్నను మీడియా మిత్రులు తిప్పించి మళ్ళించి మళ్ళీ మళ్ళీ అడిగారు. అయితే ఒకే ప్రశ్నను ఎన్నిసార్లు అడిగినా రేవంత్ మాత్రం తాపీగా ఒకే సమాధానమిచ్చారు. ఇదే ప్రశ్నను మీడియా వేర్వేరు సందర్భాల్లో అడిగినా రేవంత్ మాత్రం ఒకటే సమాధానమిచ్చారు. సీన్ కట్ చేస్తే 12వ తేదీ చంద్రబాబు ప్రమాణస్వీకారానికి రేవంత్ హాజరవ్వటంలేదు. కారణం ఏమిటంటే సింపుల్ చంద్రబాబు నుండి రేవంత్ కు ఆహ్వానం అందలేదు.

చంద్రబాబు ప్రమాణస్వీకారానికి రేవంత్ హాజరు గురించి మీడియా ఎందుకన్నిసార్లు అడిగింది ? ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఫెవికాల్ బంధమని అందరికీ తెలుసుకాబట్టే. ఓటుకునోటు కేసులో వీళ్ళద్దరి బంధం ఎంత దృఢమైందో లోకానికి మొదటిసారి తెలిసింది. అందుకనే చంద్రబాబు ప్రమాణస్వీకారానికి రేవంత్ వెళతారా వెళ్ళరా అనే ఉత్సుకత మీడియాలో కనబడింది. ఇపుడు విషయం ఏమిటంటే తన ప్రమాణస్వీకారానికి కేవలం ఎన్డీయే మిత్రపక్షాలను మాత్రమే ఆహ్వానించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారట. అలాకాదని రేవంత్, స్టాలిన్, సిద్ధరామయ్య లాంటి వాళ్ళని కూడా పిలిస్తే ఏమవుతుందో చంద్రబాబుకు ప్రత్యేకించి ఎవరు చెప్పాల్సిన అవసరంలేదు.

ఈ విషయాలన్నీ ఫలితాలు వెల్లడికాగానే చంద్రబాబు, రేవంత్ మాట్లాడుకునుంటారు. అందుకనే మీడియా ఎన్నిసార్లు ప్రశ్నించినా తొణ్ణక్కుండా బెణ్ణక్కుండా ఆహ్వానం అందితే హాజరవుతానని రేవంత్ చెప్పింది. తనకు ఆహ్వానం అందదని రేవంత్ కు ముందే తెలుసు. కాబట్టే చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని రేవంత్ చాలా లైట్ తీసుకున్నారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత చంద్రబాబు ఎలాగూ హైదరాబాద్ వస్తారు. అప్పుడు కలిస్తే సరిపోతుందని రేవంత్ అనుకున్నట్లున్నారు. అందుకనే రేవంత్ ను మహాముదురనేది. మరి ఆభేటీ ఎప్పుడు జరుగుతుందో చూడాల్సిందే.

Read More
Next Story