రాజీనామా చేస్తారా? మోదీకి రేవంత్ కౌంటర్..
x

రాజీనామా చేస్తారా? మోదీకి రేవంత్ కౌంటర్..

ప్రధాని మోదీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మోదీ చేసిన వ్యాఖ్యలకి నేడు ఢిల్లీ వేదికగా ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.


ప్రధాని మోదీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మోదీ చేసిన వ్యాఖ్యలకి నేడు ఢిల్లీ వేదికగా ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. "తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కి అధికారం ఇచ్చారు కానీ అక్కడి ప్రజల నమ్మకాన్ని కాంగ్రెస్ తొందరగా కోల్పోయింది.. అందుకే ప్రజలు NDA వైపు మొగ్గు చూపారు" అంటూ మోదీ చేసిన కామెంట్స్ పై సీఎం రేవంత్ స్పందించారు.

శనివారం ఢిల్లీలో జరగనున్న సీడబ్ల్యుసీ సమావేశానికి వెళ్లిన సీఎం రేవంత్ మీడియాతో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఇచ్చారు. తక్కువ సీట్లు వచ్చాయని అక్కడ రాజీనామా చేస్తారా అంటూ మోదీని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో మోడీ గ్యారంటీకి వారంటీ అయిపోయింది అంటూ కౌంటర్ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ బలహీనపడిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

"ప్రజలు ఇచ్చిన తీర్పు స్పష్టంగా అర్ధమైంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బలం పెరిగింది. యూపీలో బీజేపీని ప్రజలు తిప్పికొట్టారు. 2023 శాసనసభ ఎన్నికల్లో 39.5శాతం ఓట్లతో ప్రజా పాలనకు ప్రజలు ఆమోదం తెలిపారు. వందరోజుల్లో 5 గ్యారంటీలను అమలు చేసి పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగాం. ఈ ఎన్నికలు మా వంద రోజుల ప్రజా పాలనకు రెఫరెండం అని ముందే విస్పష్టంగా చెప్పాము. 17 పార్లమెంట్ స్థానాల్లో 8 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో 41 శాతం ఓట్లు కాంగ్రెస్ కి వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో మాకు 39.5శాతం ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో మా ఓట్ల శాతం పెరిగింది. మా పరిపాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని ఈ ఫలితాలతో అర్ధమవుతోంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిపించి ప్రజలు మాకు మరో సీటు అదనంగా ఇచ్చారని" సీఎం రేవంత్ అన్నారు.


Read More
Next Story