మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ క్లారిటీ..
x

మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ క్లారిటీ..

తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అనేది కొంత కాలంగా కీలక చర్చనీయాంశంగా కొనసాగుతోంది.


తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అనేది కొంత కాలంగా కీలక చర్చనీయాంశంగా కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఇతర నేతలు ఢిల్లీకి పయనమైన ప్రతి సారి కూడా మంత్రి విస్తరణ అంశం తెరపైకి వస్తూనే ఉంది. పలు సందర్భాల్లో అయితే పలా నేతలనే సీఎం సిఫార్సు చేయనున్నారన్న వాదన కూడా బలంగా వినిపించింది. కాగా గురువారం సీఎం రేవంత్ రెడ్డి సహా టీకాంగ్రెస్‌ నేతలు పలువురు ఢిల్లీకి వెళ్లారు. పలు విషయాలపై పార్టీ పెద్దలతో చర్చించారు. పార్లమెంటులో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా భేటీ అనంతరం పార్లమెంటులో సీఎం రేవంత్.. మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలోనే ఇన్నాళ్లూ మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉన్న తెలంగాణ మంత్రి వర్గ విస్తరణపై స్పష్టతనిచ్చారు. ఈ సందర్బంగానే తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ అంశం అనేది తమ చేతుల్లో ఏమీ లేదని, తెలంగాణ కేబినెట్‌లో కూడికలు, తీసివేతలు అన్నీ కూడా అధిష్టానం చేతిలోనే ఉంటాయని తేల్చి చెప్పారు రేవంత్.

తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇప్పుడు లేనట్లేనన్నారు. ‘‘మంత్రివర్గంలో ఎవరు ఉండాలి అనే నిర్ణయం పూర్తిగా అధిష్టానం చేతిలో ఉంది. వారు ఎన్నుకున్న నాయకులు మంత్రివర్గంలో చేరతారు. వద్దనుకున్నవారు బయటకు వెళ్తారు. నేను ఎవరి పేర్లు సిఫార్సు చేయలేదు. ప్రతిపక్ష నేతలపై కేసుల విషయంలో కాంగ్రెస్ పార్టీ చట్ట ప్రకారమే వెళ్తాం. త్వరగా అరెస్ట్ చేయించి జైల్లో వేయాలన్న ఆలోచన తమ ప్రభుత్వానికి అస్సలు లేదు. ఏది చేసినా చట్టప్రకారమే చేస్తాం. మా దృష్టికి వచ్చిన ఏ సమస్యకైనా శాశ్వత పరిష్కారం చూపడానికే ప్రయత్నిస్తాం. కుల గణన కూడా అటువంటిదే. బీసీలు, బలహీనవర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసమే ఈ సర్వే చేశామని, దాని ప్రకారం భవిష్యత్తులో సంక్షేమ పథకాల రూపకల్పన జరగనుంది’’ అని చెప్పారు.

‘‘కుల గణనతో ముస్లిం రిజరవేషన్లకు శాశ్వత పరిష్కారం లభించినట్లే. పీసీసీ కార్యవర్గ కూర్పు కొలిక్కి వచ్చింది. దీనిపై ఒకటి రెండు రోజుల్లో ప్రకటన ఉంటుంది. నేను రాహుల్ అపాయింట్‌మెంట్ కోరలేదు. రాహుల్‌తో నా అనుబంధం తెలియనివాళ్లు మాట్లాడితే నాకేంటి? ప్రభుత్వం, పార్టీలో కీలక నిర్ణయాలు అధిష్ఠానం దృష్టిలో ఉంటాయి. పార్టీ, పార్టీ నేతల మనోభావాలకు అనుగుణంగానే ఉంటా. వ్యక్తిగత నిర్ణయాలు ఎప్పుడూ ఉండవు. పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే నా లక్ష్యం. పని చేసుకుంటే పోవడమే నాకు తెలుసు. పరతి ఒక్క విమర్శకు స్పందించాల్సిన అవసరం లేదు. కులగణనలో బీసీలు ఐదున్నర శాతం పెరిగారు. బీసీలు పెరిగిన విషయాన్ని లెక్కలతో సహా చూశాక బీజేపీ నేత పాయల్ శంకర్ అసెంబ్లీలోనే అంగీకరించారు’’ అని చెప్పారు.

Read More
Next Story