
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టాలి : కెటిఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా పని చేయాలంటే బిఆర్ఎస్ ను గెలిపించాలి
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న బిఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బిర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కోరారు. ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కర్రుకాల్చి వాత పెట్టాలని ఆయన అన్నారు.
పరకాలలో గిప్ట్ ఎ స్మైల్ కార్యక్రమంలో కెటిఆర్ పాల్గొన్నారు. మహిళలకు కుట్టు మిషన్లు, కెసీఆర్ కిట్లను కెటిఆర్ పంచి పెట్టారు. ఆరు గ్యారెంటీలతో రేవంత్ రెడ్డి గారడీలు చేశాడన్నారు. నాలుగు వేల పెన్షన్, తులం బంగారం, రైతుబంధు 15 వేలు ఎక్కడ అని కెటిఆర్ ప్రశ్నించారు.
స్థానిక సంస్థల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుబంధు వేస్తుందన్నారు. ఇందిరమ్మ ఇళ్లు కాంగ్రెస్ అయ్య జాగీరు కాదన్నారు. ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని కెటిఆర్ ప్రశ్నించారు.
సామాజిక న్యాయం బిఆర్ఎస్ వల్లే సాధ్యమన్నారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం పేరిట డ్రామాలు ఆడుతున్నాడని కెటిఆర్ విమర్శించారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ ఎస్ సామాజిక న్యాయం పాటించిందని, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సామాజిక న్యాయం పాటిస్తుందని కెటిఆర్ హామి ఇచ్చారు.