
సర్వేయర్లు చిత్తశుద్దితో పని చేయాలి
సర్వేయర్లకు నియామక పత్రాలు అందజేసిన రేవంత్ రెడ్డి
బిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చట్టం అడ్డం పెట్టుకుని బిఆర్ఎస్ నాయకులు లబ్దిపొందారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా నియమితులైన సర్వేయర్లకు ముఖ్యమంత్రి అపాయింట్ మెంట్ లెటర్లను ప్రదానం చేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దొరలకు ధరణి చట్టం చుట్టంగా మారిందని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ చట్టాన్ని సంస్కణ చేసినట్టు రేవంత్ రెడ్డి చెప్పారు.
కొత్తగా నియామకమైన సర్వేయర్లు చిత్తశుద్దితో పని చేసినప్పుడు అసలైన లబ్దిదారులకు న్యాయం జరుగుతుందన్నారు. ధరణి చట్టం ద్వారా భూములపై యాజమాన్య హక్కులు సంపాదించుకున్నదొరలను గత ఎన్నికల్లో పొలిమేరల వరకు ప్రజలు తరిమేసారని ముఖ్యమంత్రి అన్నారు.
ప్రజా పాలనలో ఉద్యోగ నియామకాలనుచేపట్టి నిరుద్యోగుల కళ్లల్లో ఆనందం చూశామన్నారు. 2047 నాటికి మూడు ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు రేవంత్ రెడ్డి చెప్పారు.
తెలంగాణ అభివృద్దిలో సర్వేయర్లు సహకారం అందించాలన్నారు. దేశానికి వెన్నెముకగా ఉన్న రైతులకు సర్వేయర్లు అండగా నిలబడాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
భూ వివాదాలు పరిష్కరించడానికే లైసెన్స్డ్ సర్వేయర్లు
బిఆర్ఎస్ తెచ్చిన ధరణి చట్టం కొందరికి చుట్టంగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. శిక్షణ పొందిన సర్వేయర్లకు నియామక పత్రాలను శనివారం ముఖ్యమంత్రి హైదరాబాద్ లో ఆయన అంద జేశారు. కెసీఆర్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చట్టం ద్వారా కెసీఆర్ కుటుంబీకులు ఆధిపత్యం చేసిన్నట్టు ఆయన విమర్శించారు. పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోవడానికి ధరణి చట్టమేనన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోరాగానే ధరణి భూతాన్ని వదిలించామన్నారు. భూ వివాదాలు పరిష్కరించడానికే లైసెన్స్ ఉన్న సర్వేయర్లను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. గత ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. ఇచ్చినా పరీక్షలు నిర్వహించలేదన్నారు. ఒకవేళ పరీక్షలు నిర్వహించినా ప్రశ్నా పత్రాలు జిరాక్స్ సెంటర్ లో లభించేవన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వహాయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పునరావాస కేంద్రంగా మారిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను పూర్తిగా ప్రక్షాళన చేసినట్టు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన ఏడాదిలోపే 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. ఉద్యోగుల భర్తీని కొందరు అడ్డుకోవడానికి కోర్టులో కేసులు వేశారన్నారు. కోర్టుల్లో పోరాడి అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేశామని రేవంత్ రెడ్డి ఈ సందర్బంగా గుర్తు చేశారు.