కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ భేటీ..
x

కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ భేటీ..

బీసీ రిజర్వేషన్ల అమలే అత్యంత కీలకాంశంగా మారింది.


బీసీ రిజర్వేషన్ల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌తో ఇదే అంశంపై రేవంత్ చర్చించారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సహా పలువురు మంత్రులతో కలిసి రేవంత్.. వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా ఉన్న అంశాలపై చర్చించారు. వాటిలో కులగణన, బీసీ రిజర్వేషన్లు వంటివి కీలకంగా ఉన్నాయి. వీటితో పాటుగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆచరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై కూడా చర్చించినట్లు సమాచారం.

ఈ చర్చలో భాగంగానే స్థానిక సంస్థ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఒక కొలిక్కి తీసుకురావాల్సిన అవసరం ఉందని, ఈ విషయంలో ఎలా ముందుకు అడుగు వేయాలి అన్న విషయంపై రేవంత్ రెడ్డి.. వేణుగోపాల్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. ఇది వరకు అనుకున్నట్లు పార్టీ పరంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలా? లేదంటే ఈ అంశంపై కేంద్రాన్ని ఒత్తిడి చేయాలా? అని వారు చర్చించారని తెలుస్తోంది. ఒకవేళ పార్టీ పరంగా మాత్రమే బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తే.. ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి రావొచ్చు? ప్రజల్లో ప్రభుత్వంపై ఎలాంటి అభిప్రాయాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి? వంటి అనేక అంశాలను వారు చర్చించారని సమాచారం.


వీటితో పాటుగా కొంతకాలంగా పార్టీ చెలరేగుతున్న అసమ్మతి జ్వాలలు సహా మరిన్ని పార్టీ సంబంధిత అంశాలపై కూడా వారు చర్చించారు. పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా తాను పరిశీలించిన అంశాలను వేణుగోపాల్‌కు వివరించారని తెలుస్తోంది. కొందరు నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నాయకులు ప్రతిపాదించినట్లు సమాచారం.Holds


Read More
Next Story