ప్యూచర్ సిటీ పేరిట రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం
x

ప్యూచర్ సిటీ పేరిట రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం

జూబ్లిహిల్స్ ఎన్నికల ప్రచారంలో కెటిఆర్


ప్రస్తుతం వరదలతో ప్రజలు సతమతమతమవుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మొదలు బెట్టాడని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆదివారం ఆరోపించారు. ఫ్యూచర్ సిటీని తెలంగాణ భావితరాలు నిర్మించుకుంటారని ఆయన అన్నారు. ప్రజెంట్ సిటీని వదిలేసి ప్యూచర్ సిటీ గూర్చి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. జనం లేని ఫ్యూచర్ సిటీకు కొత్త మెట్రో కడతాననడం రేవంత్ రెడ్డి చావు తెలివితేటలకు నిదర్శనమన్నారు.

జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బిఆర్ఎస్ వర్కింగ్ పెసిడెంట్ కెటిఆర్ షేక్ పేటలో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ బాకీ కార్డును పంపిణీ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామిలు ఇప్పటివరకు పూర్తిచేయలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు అమలయ్యే వరకు బిఆర్ఎస్ పెద్ద ఎత్తున ఉద్యమం చేయనుందని కెటిఆర్ హెచ్చరించారు. జూబ్లి హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పకపోతే మరో మూడేళ్లు వారి అరాచకాలకు అడ్డే ఉండదన్నారు. ఎన్నికలు ముగియగానే మంత్రులు, సామంతులు అందరూ కనుమరుగవుతారని, ప్రజల కష్ట సుఖాలు పంచుకునేది బిఆర్ఎస్ మాత్రమేనని కెటిఆర్ అన్నారు. జూబ్లిహిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను ఆశీర్వదించాలని కెటిఆర్ కోరారు.

Read More
Next Story