![కేసీఆర్ కుటుంబాన్ని బహిష్కరించండి.. పిలుపిచ్చిన రేవంత్ కేసీఆర్ కుటుంబాన్ని బహిష్కరించండి.. పిలుపిచ్చిన రేవంత్](https://telangana.thefederal.com/h-upload/2025/02/14/512850-revanth-reddy.webp)
కేసీఆర్ కుటుంబాన్ని బహిష్కరించండి.. పిలుపిచ్చిన రేవంత్
మోడీ.. ఒరిజినల్ బీసీ కాదని, లీగల్‌గా ఆయన కన్వర్టెడ్ బీసీ అని అన్నారు రేవంత్.
తెలంగాణలో కుల గణన నిర్వహించి రాష్ట్రాన్ని దేశానికే దిక్సూచిగా నిలిపిన ప్రభుత్వం తమదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కుల గణన, ఎస్సీ వర్గీకరణపై గాంధీభవన్‌లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహించారు. ఇందులో సీఎంరేవంత్ కూడా పాల్గొన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. మోడీ.. ఒరిజినల్ బీసీ కాదని, లీగల్‌గా ఆయన కన్వర్టెడ్ బీసీ అని అన్నారు రేవంత్. స్వాంతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశంలో కొనసాగుతున్న రెండు సమస్యలను తమ ప్రభుత్వ పరిష్కరించిందని, వీటి విషయంలో సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. ప్రతిపక్షాలు తమ రాజకీయ మైలేజీ కోసం అపోహలు సృష్టిస్తోందని, ప్రజల్లో అనుమానాలు కలిగించాలని ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. నిజం నిప్పులాంటిదని, ఎవరు ఆర్పాలని చూసినా.. ఎవరు ఒళ్లో పెట్టకున్నా కాలుతుందని వ్యాఖ్యానించారు.
‘‘కొందరు ఆరోపిస్తున్నట్లు కులగణన సర్వేలో ఎలాంటి పొరపాటు జరగలేదు. ఇప్పుడు జరిగిన కుల గణన సర్వేను తప్పుబడితే బీసీలు శాశ్వతంగా నష్టపోతారు. దేశమంతటా కుల గణన జరగాలని పార్లమెంటు వేదికగా ప్రధాని మోదీని రాహుల్ గాంధీ నిలదీశారు. దేశం మొత్తం కూడా కుల గణన జరగాలని కోరుకుంటుంది. మోదీ పుట్టుకలతో బీసీ కాదు. సీఎం అయిన తర్వాత తన కులాన్ని బీసీల్లో కలుపుకున్నారు. మోదీ.. సర్టిఫికేట్ ప్రకారం మాత్రమే బీసీ. ఆయన వ్యక్తత్వం మాత్రం అగ్ర కులానిది. కుల గణన జరిగితే చట్ట ప్రకారం రిజర్వేషన్లు పొందవచ్చు. అధికారిక లెక్కలు ఉంటే బసీల రిజర్వేషన్లు పెంచాలని సుప్రీంకోర్టు కూడా చెప్పొచ్చు. ఇప్పుడు తమ ప్రభుత్వం రెండోసారి కుల గణన సర్వేను చేపట్టనుంది. దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇంటి ముందు మేలుకొలుపు డబ్బు కొట్టాలని బీసీ సంఘాలకు విజ్ఞప్తి చేస్తున్నా. సర్వేలో పాల్గొనకపోతే సామాజిక బహిస్కరణే శిక్ష’’ అని వ్యాఖ్యానించారు.
‘‘రాష్ట్రంలోని మైనారిటీల లెక్క తీయక తప్పదు. ఎందుకంటే బీసీ-ఈ లో ముస్లింలు ఉన్నారు. వారు 4 శాతం రిజర్వేషన్ పొందుతున్నారు. కేసీఆర్‌కి తెలంగాణ సమాజంలో జీవించే హక్కు లేదు. వాళ్ళు సర్వేలో పాల్గొని ఉంటే మాట్లాడే హక్కు ఉండేది. కేసీఆర్, కేసీఆర్‌లతో పాటు నిన్న మొన్న గ్యాంబ్లింగ్ లో పట్టుబడ్డ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఈ గ్యాంబ్లర్లు అందరూ లెక్కలోకి రాలేదు. కేసీఆర్ జాతి దొబ్బి తిన్నది ఎంత? అని బీసీలు ప్రశ్నిస్తారు. అందుకే ఇప్పటి వరకు లెక్కలు బయట పెట్టలేదు. రేవంత్ రెడ్డి చివరి రెడ్డి సీఎం అని నన్ను కూడా కొందరు అంటున్నారు. నేను చివరి వాడిని అయినా పర్వాలేదు.. కానీ మా నిబద్ధత ఇది. మా నాయకుడు ఇచ్చిన సిద్ధాంతాలను ఫాలో అయ్యాం. మా జాతి జనాభా పెంచుకోవాలి అనుకుంటే 5శాతం ఎందుకు చూపిస్తాం. 20 శాతం గా పెంచుకోమా..?’’ అని ప్రశ్నించారు. అనంతరం ప్రధాని మోదీని ఉద్దేశించి కూడా రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మోదీ వాస్తవానికి బీసీ కాదు.. లీగల్లి కన్వర్ట్ బీసీ. నరేంద్ర మోదీ పుట్టుకతో బీసీ కాదు. సీఎం అయ్యాక బీసీలలో ఆయన కులాన్ని కలుపుకున్నారు. జనాభా లెక్కలు ఎందుకు చెయ్యలేదు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే జనాభా లెక్కల తో పాటు కుల గణన చెయ్యాలి. చట్టం సవరణ కోసం కేంద్రం మీద ఒత్తిడి చేయాలి’’ అని కోరారు. అంతేకాకుండా కుల గణన సర్వేలో పాల్గొనని కేసీఆర్ కుటుంబన్నీ సామాజిక బహిష్కరణ చేయాలని ప్రజలను కోరారు. ఈ సభలో తీర్మానం ప్రవేశ పెడుతున్నా? అని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ ఇంటి ముందు మేలుకొలుపు డబ్బు మోగించాలని, లేదంటే వారిని తెలంగాణ సమాజం నుంచి బహిష్కరించాలని పిలుపునిచ్చారు.