Harish Rao
x

‘రేవంత్ రెడ్డి.. తెలంగాణ ద్రోహిగా మిగలడం ఖాయం..’

నాడు బ్యాగ్‌మన్.. నేడు బొంకుమాన్.. రేవంత్‌పై హరీష్ రావు విమర్శల వెల్లువ.


తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేయడానికి రేవంత్ సిద్ధమయ్యారంటూ ఆరోపించారు. చంద్రబాబుతో ఉన్న అనుబంధంతోనే బనకచర్ల విషయంలో రేవంత్ రెడ్డి బొంకుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గురుదక్షిణలో భాగంగానే బనకచర్ల ఒప్పందం చేసుకున్నారన్నారు. బనకచర్లపై ప్రజాభవన్‌లోనే చంద్రబాబు, రేవంత్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందని హరీష్ రావు ఆరోపించారు. ‘‘బనకచర్ల అంశాన్ని లేవనెత్తింది, పోరాటం ప్రారంభించింది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పోరుబాట పడితే కాంగ్రెస్ మాత్రం మొద్దు నిద్ర పోతోంది’’ అని చురకలంటించారు. మధ్యాహ్నం బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ పెడితే అదే రోజు రాత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. బనకచర్లపై కేంద్రానికి లేఖ రాశారని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు కోసం బ్యాగులు మోసిన బ్యాగ్‌మన్(రేవంత్‌ను ఉద్దేశించి) ఇప్పుడు బనకచర్ల విషయంలో బొంకుడు రాజకీయాలు చేస్తూ బొంకుమన్ అయ్యారంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రేవంత్.. ఈ బొంకుడు రాజకీయాలు బంద్ చేయాలని హరీష్ కోరారు.

‘‘రేవంత్‌కు నది బేసిన్ల గురించి కూడా కనీస అవగాహన లేదు. స్కూల్ బీజేపీ, కాలేజీ టీడీపీ, ఉద్యోగం కాంగ్రెస్‌లో చేస్తున్నానని రేవంతే చెప్పారు. రేవంత్ టెక్నికల్‌గా కాంగ్రెస్ సీఎం. కానీ ఆయన మనసు మొత్తం టీడీపీలోనే ఉంది. బనకచర్లను ఆపే చిత్తశుద్ధి రేవంత్‌కు లేదు. బెజవాడ బజ్జీలు తిని బనకర్లకు పచ్చజెండా ఊపారు. తెలంగాణ నీటి హక్కులను రేవంత్‌ మరణశాసనం రాశారు. తెలంగాణ పుటల్లో సీఎం రేవంత్‌ ద్రోహిగా మిగిలిపోతారు. రేవంత్‌ చిల్లర మల్లర రాజకీయాలు మానేసి రాష్ట్రం కోసం పోరాడాలి. మంగళవారం ఇచ్చిన ప్రజంటేషన్‌లో అన్నీ అబద్దాలే. రేవంత్‌ అబద్ధాలను బీఆర్‌ఎస్‌ చీల్చి చెండాడుతుంది. కేసీఆర్‌ మీదు ముఖమంత్రి రేవంత్‌ నిందలు మోపుతున్నారు. సీఎం వాస్తవాలు మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గొంతు కోస్తోంది. మాకు తెలంగాణ రాష్ట్ర హక్కులే ముఖ్యం. బనకచర్లపై ప్రజంటేషన్‌ ఇస్తే అన్ని పార్టీలను పిలవాలి కదా?. అహంకారంతో మాట్లాడితే ప్రజలే బుద్ధి చెబుతారు’’ అంటూ హరీష్ రావు మండిపడ్డారు.

Read More
Next Story