రేవంత్ దక్షిణాది నేత అవుతాడా?
కేంద్రం దక్షిణ భారత రాష్ట్రాల మీద చూపిస్తున్న వివక్ష మీద దక్షిణాది రాష్ట్రాల కూడగట్టేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ప్రయత్నం
నిధులు, ప్రాజక్టులు, ఇన్ స్టిట్యూట్ లను కేటాయించడంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకు త్వరలో దక్షిణాది ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి చెప్పారు.
ఈ సాయంకాలం హైదరాబాద్ లో కేంద్ర బడ్జెట్ స్పందిస్తూ ఆయన ఈ విధంగా చెప్పారు. కేంద్రం తెలంగాణ మీద ఎలాంటి వివక్ష చూపిస్తున్నదో ఈ రోజు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సాక్ష్యం అని ఆయన్నారు.
మొత్తం దక్షిణాది రాష్ట్రాలకు చాలా అన్యాయం జరగుతు ఉందని చెబుతూ ఈ విషయంలో ఈ రాష్ట్రాలను సమీకరించాలనుకుంటున్నానని, దీనిమీద కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశానని, వారు సానుకూలంగా స్పందించారని ఆయన వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ కూడా ఈ విషయంలో కలిసిరావాలని ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరారు. త్వరంలో ఆంధ్రప్రదేశ్, కేరళ, పాండిచ్ఛేరి రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖరాస్తున్నట్లు ఆయన చెప్పారు.
కేంద్రం ప్రభుత్వం తెలంగాణ హక్కులను కాలరాస్తూ ఉందని, దీనిని వ్యతిరేకించాలని ఆయన అన్నారు.