కేటీఆర్ పాదయాత్ర కోరిక తీర్చబోతున్న రేవంత్
x
Revanth Reddy Padayatra

కేటీఆర్ పాదయాత్ర కోరిక తీర్చబోతున్న రేవంత్

ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రెచ్చగొట్టిన ఫలితంగానే రేవంత్ రెడ్డి మూసీనది వెంబడి పాదయాత్ర చేయబోతున్నారు


టీవీలో మరక మంచిదే అనే ప్రకటన రావటం అందరికీ గుర్తుండే ఉంటుంది. అదే పద్దతిలో ఒక్కోసారి ప్రతిపక్షలు ముఖ్యమంత్రిని రెచ్చగొట్టడం వల్ల మంచే జరుగుతుందని అనుకోవాలి. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ రెచ్చగొట్టిన ఫలితంగానే రేవంత్ రెడ్డి మూసీనది వెంబడి పాదయాత్ర చేయబోతున్నారు. మూసీనది వెంబడి రేవంత్ పాదయాత్ర చేయాలి..పాదయాత్ర చేయాలంటు కేటీఆర్, హరీష్ రావు నానా గోలచేశారు. మూసీనది వెంబడి పాదయాత్రచేస్తే జనాలు తగినవిధంగా బుద్ధిచెబుతారంటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR), కీలకనేత హరీష్ రావు(Harish Rao) పదేపదే రేవంత్ ను రెచ్చగొట్టారు. వాళ్ళు రెచ్చగొట్టిన ఫలితమే శుక్రవారం రేవంత్ రెడ్డి(Revanth Reddy Padayatra) పాదయాత్ర చేయబోతున్నారు. మధ్యాహ్నం నల్గొండ జిల్లా(Nalgonda District)లోని యాదాద్రి ఆలయం(Yadadri Temple)లో ప్రత్యేకపూజలు, ఆలయం అభివృద్ధిపై సమీక్ష తర్వాత రోడ్డుమార్గంలో బయలుదేరి సంగెం దగ్గరకు చేరుకుంటారు. అక్కడినుండి మూసీనది(Musi River) పునరుజ్జీవన పాదయాత్రకు శ్రీకారం చుడతారు. మూసీనది కుడి ఒడ్డున ఉన్న భీమలింగం వరకు అంటే సుమారు 2.5 కిలోమీటర్ల నడుస్తారు. అక్కడ కొద్దిసేపు స్ధానికులతో మాట్లాడుతారు. మళ్ళీ అక్కడినుండి ధర్మారెడ్డి పల్లి కెనాల్ వెంబడే సంగెం-నాగిరెడ్డిపల్లి రోడ్డువరకు పాదయాత్ర చేస్తారు. అక్కడే ఏర్పాటుచేసిన ప్రచార రథంమీదకు చేరుకుని స్ధానికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

మూసీనది వెంబడి పాదయాత్ర ఉద్దేశ్యం ఏమిటంటే కలుషితమైపోయిన నదీజలాల వల్ల ప్రజలకు ఏ విధంగా నష్టం జరగబోతోందనే విషయాన్ని రేవంత్ వివరించబోతున్నారు. అలాగే మూసీనది పునరుజ్జీవన ప్రాజెక్టు అవసరాలు ఏమిటి ? దానివల్ల జరగబోయే దీర్ఘకాలిక ఉపయోగాలు ఏమిటి ? నది పునరుజ్జీవన ప్రాజెక్టు భవిష్యత్తరాలకు ఏ విధంగా ఉపయోగపడబోతోందనే విషయాలను రేవంత్ వివరించబోతున్నారు. రేవంత్ పాదయాత్రకు అవసరమైన ఏర్పాట్లను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంఎల్ఏలు, అధికారులు దగ్గరుండి చూసుకుంటున్నారు.

నిజానికి పాదయాత్ర వ్యవహారం రేవంత్ నుండే మొదలైంది. మూసీనది పునరుజ్జీవన ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడుతు జనాలను కేటీఆర్, హరీష్ రావు తదితరులు రెచ్చగొడుతున్న విషయం తెలిసిందే. ప్రాజెక్టు ఇంకా ప్రారంభం కాకముందే లక్షన్నర కోట్ల రూపాయల కుంభకోణమంటు కేటీఆర్, హరీష్ నానా గోలచేస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి రేవంత్ మాట్లాడుతు మూసీనది వెంబడి పాదయాత్ర చేస్తే అక్కడి పరిస్ధితులు అర్ధమవుతాయని అన్నారు. కేటీఆర్, హరీష్ ను పాదయాత్ర చేయమని రేవంత్ చెప్పారు. మూసీనది నీళ్ళు ఏ విధంగా విషంగా మారింది, మూసీనదిలో కలుస్తున్న విషతుల్యాలు, వ్యర్ధాల వల్ల నది ఏ విధంగా కాలుష్యమైపోయింది, మురికికూపంగా మారిపోయిందో పాదయాత్రలో స్వయంగా పరిశీలించమని రేవంత్ చెప్పారు.

అయితే కేటీఆర్, హరీష్ రివర్సులో మాట్లాడుతు రేవంత్ నే పాదయాత్ర చేయమన్నారు. రేవంత్ గనుక మూసీనది వెంబడి పాదయాత్ర చేస్తే జనాలు మీదపడి కొడతారంటు పదేపదే రెచ్చగొట్టారు. దాంతో మూసీనది వెంబడి కొంతదూరం పాదయాత్ర చేయాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. ప్రతిపక్షాలు రెచ్చగొట్టే చర్యల వల్ల మూసీనది పునరుజ్జీవన ప్రాజెక్టుకు ఏ విధంగా నష్టం జరుగుతుంది, ప్రతిపక్షాల ట్రాపులు పడితే జనాలకు జరగబోయే దీర్ఘకాల నష్టాలు ఏమిటనే విషయాన్ని రేవంత్ ఇప్పటికే వివరించారు. పాదయాత్ర సందర్భంగా ఇవే విషయాలను మరోసారి రేవంత్ స్ధానికులకు వివరించబోతున్నారు. స్థానికులతో ఇంటరాక్షన్ కోసమే ప్రత్యేకంగా రేవంత్ పాదయాత్ర చేయబోతున్నారు. పాదయాత్ర చేయటం ద్వారా కేటీఆర్, హరీష్ కోరిక తీర్చబోతున్నారు.

Read More
Next Story