
హిందు దేవుళ్ళపై రేవంత్ వివాదాస్పద వ్యాఖ్యలు(వీడియో)
హిందు దేవుళ్ళపై వివాదాస్పద వ్యాఖ్యలు ఎక్కువైపోతున్నాయి.
హిందు దేవుళ్ళపై వివాదాస్పద వ్యాఖ్యలు ఎక్కువైపోతున్నాయి. వ్యాఖ్యలు చేసేవాళ్ళు కావాలని చేస్తున్నారా ? లేకపోతే ప్రచారం కోసం చేస్తున్నారా ? అన్నదే డౌటనమానంగా ఉంది. ఇపుడు విషయం ఏమిటంటే స్వయంగా ముఖ్యమంత్రి ఎనుముల(Revanth) రేవంత్ రెడ్డే హిందు దేవుళ్ళపై(Hindu Goddess) వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం(Controversial comments) సంచలనంగా మారింది. ఒక సమావేశంలో మాట్లాడుతు హిందువులకు ఎన్ని దేవతలున్నారు ? దేవుళ్ళున్నారు ? 3 కోట్లున్నారా అని ప్రశ్నించాడు.
పెళ్ళి చేసుకోనివాళ్ళకు హనుమంతుడు ఉన్నాడు, రెండు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకు ఇంకో దేవుడున్నాడు, మందుతాగేవారికి ఇంకో దేవుడున్నాడు, కల్లుతాగేవాళ్ళకు, కోడిని కోయాలనే వాళ్ళకు మైసమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ ఉన్నారు. పప్పుతినే వాళ్ళకు కూడా దేవుడున్నాడు, అవునా ? అన్నీరకాల దేవుళ్ళున్నారు , అని వ్యగ్యంగా అన్నాడు.
హిందూ దేవుళ్ళ పైన #RevanthReddy వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘పెళ్లి కానోడికి హనుమంతుడు ఉన్నాడు, రెండు పెళ్ళిలు చేసుకునే వాళ్లకు ఒక దేవుడు ఉన్నడు మందు తాగేటోళ్లకు ఇంకో దేవుడు అని ఒక్కొక్కరికి ఒక్కో దేవుడు ఉన్నాడు’ అన్న రేవంత్. pic.twitter.com/cs0KhfwP6J
— Subbu (@Subbu15465936) December 2, 2025
సమావేశంలో హిందు దేవుళ్ళు, దేవతల గురించి ఎందుకు ప్రస్తావించాడో రేవంత్ కే తెలియాలి. పెళ్ళి చేసుకోని వాళ్ళకు, రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకు ఇంకో దేవుడు, మందుతాగే వాళ్ళకొక దేవుడు అని ఎద్దేవా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్ధంకావటంలేదు. అసందర్భంగా దేవతలు, దేవుళ్ళపై రేవంత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. చివరకు ఈ వ్యాఖ్యలు ఎక్కడికి దారితీస్తాయో చూడాలి.

