ఆన్ లైన్ బెట్టింగ్ పై రేవంత్ కీలక నిర్ణయం
x
Revanth

ఆన్ లైన్ బెట్టింగ్ పై రేవంత్ కీలక నిర్ణయం

ఆన్ లైన్ బెట్టింగులపై దర్యాప్తుకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ (సిట్) ఏర్పాటుచేస్తున్నట్లు అసెంబ్లీలో రేవంత్ ప్రకటించారు.


ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ బెట్టింగులపై దర్యాప్తుకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ (సిట్) ఏర్పాటుచేస్తున్నట్లు అసెంబ్లీలో రేవంత్ ప్రకటించారు. ఇప్పటివరకు వివిధ పోలీసుస్టేషన్లలోబెట్టింగ్ యాప్ ల కేసుల విచారణ మొత్తం ఇకనుండి సిట్ కు బదిలీ అవుతుంది. ఆన్ లైన్ బెట్టింగ్ యాప్(Online Betting Apps) ల విషయంలో తమ ప్రభుత్వ కఠినంగా వ్యవహరించబోతోందని చెప్పారు. ఇప్పటికే ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న 11 మంది యూట్యూబర్లతో పాటు సినీ సెలబ్రిటీలు(Tollywood celebrities) రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్(Prakash Raj), మంచులక్ష్మి(Manchu Lakshmi), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో పాటు మరికొందరిపైన కూడా పోలీసులు కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఈ విషయాలన్నింటినీ రేవంత్(Revanth) అసెంబ్లీలో ప్రస్తావించారు.

బెట్టింగ్ యాప్ నిర్వాహకులు, ప్రమోట్ చేసేవారు, లబ్దిపొందేవారిపైన కఠిన చర్యలు తీసుకుంటేనే సమాజం బాగుపడుతుంది. అందుకనే ఇతర ప్రాంతాల్లో అధ్యయనంచేసి తెలంగాణ(Telangana)లో బెట్టింగ్ యాప్ ల నియంత్రణకు సిట్ వేసినట్లు చెప్పారు. బెట్టింగ్ యాప్ లకు సంబంధించి ప్రత్యక్షంగా, పరోక్షంగా భాగస్వాములైన ఎవరినీ ప్రభుత్వం వదిలినపెట్టదన్నారు. అయితే సిట్ విధివిధానాలను మాత్రం రేవంత్ సభలో ప్రకటించలేదు.

Read More
Next Story