హైద్రాబాద్ అబ్దుల్లామెట్ లో   దొంగల స్వైర విహారం
x

హైద్రాబాద్ అబ్దుల్లామెట్ లో దొంగల స్వైర విహారం

మూడు రియల్ ఎస్టేట్, ఓ ఇంట్లో దోపిడి


హైద్రాబాద్ అబ్దుల్లామేట్ లో దొంగలు భీభత్సం సృష్టించారు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అబ్దుల్లామెట్ ఇనాంగూడలో ప్రవేశించారు. వరుసగా మూడు రియల్ ఎస్టేట్ కార్యాలయాల్లో తాళాలు పగుల గొట్టి దోపిడికి పాల్పడ్డారు. సీసీటీవీ ఫుటేజి దొరకకపోవడంతో దొంగలు ఎవరు అనేది తేలడం లేదు. రియల్ ఎస్టేట్ కార్యాలయాల్లో పెద్దగా నగదు దొరకకపోవడంతో దొంగలు ఫ్రస్టేషన్ లో కార్యాలయ ఫర్నిచర్, ప్రింటర్లు,కంప్యూటర్లను ధ్వంసం చేశారు. రియల్ ఎస్టేట్ కార్యాలయానికి సంబంధించి పార్క్ చేసి ఉన్న కారు అద్దాలను పగులగొట్ట ధ్వసం చేశారు. వరుసగా మూడు రియల్ ఎస్టేట్ కార్యాలయాల్లో దొంగలకు వర్కవుట్ కాకపోవడంతో సమీపంలోని ఓ ఇంట్లో దూరి దోపిడికి పాల్పడ్డారు. అక్కడ చేతికి అందినది దోచుకున్నారు. యజమానులు ఇంట్లో లేకపోవడంతో ఫిర్యాదుచేసే వ్యక్తులు వస్తే గానీ దొంగతనం ఎంత అనేది తెలియడం లేదు. ఇంటి యజమానులు సమీప బంధువుల పెళ్లికి వెళ్లినట్టు సమాచారం. సెల్లార్ లో ఇంటి యజమాని ఇన్నోవా కారును మారుతాళంతో తీసి బేఫికర్ గా తిరిగారు. మళ్లీ అదే కారును సెల్లార్ లో తెచ్చి పెట్టి దొంగలు ఉడాయించారు.

అబ్దుల్లామెట్ దొంగలకు అడ్డాగా మారింది. గత అర్ద రాత్రి వచ్చిన దొంగలు అంత రాష్ట్ర దొంగలు అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ చోరీలో దాదాపు 50 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు పోలీసుల ప్రాథమిక సమాచారం. ఈ దొంగతనంతో బాటు హింసాత్మక సంఘటనలకు పాల్పడంటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. యజమానులు సీసీటీవీలు అమర్చకపోవడం వల్ల పోలీసుల దర్యాప్తుకు ఆటంకం ఏర్పడింది.

Read More
Next Story