ఆర్పీఎఫ్ 84వేల మంది పిల్లలను రక్షించింది...
x

ఆర్పీఎఫ్ 84వేల మంది పిల్లలను రక్షించింది...

గడచిన ఏడేళ్లలో దేశంలో ఆపరేషన్ నాన్హే ఫరిస్టే కింద రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ 84,119 మంది పిల్లలను రక్షించింది. తప్పిపోయి,అలిగి వచ్చిన పిల్లలను ఆర్పీఎఫ్ కాపాడారు.


రైల్వేస్టేషన్లు, రైళ్లలో ప్రమాదాల బారిన పడకుండా 84,119 మంది పిల్లలను రక్షించి వారిని తల్లిదండ్రుల వద్దకు చేర్చిన ఘటనలు తాజాగా వెలుగు చూశాయి. 2018 నుంచి 2024 వరకు ఏడేళ్లలో 80వేలమందికి పైగా పిల్లలను కాపాడిన ఘటన సంచలనం రేపింది.

చిన్న పిల్లలు అలిగి ఇంట్లో అలిగి బయటకు వెళితే ముందుగా రైల్వేస్టేషన్లుకు వెళుతుంటారు. రైల్వేస్టేషన్లలో పాగా వేసిన కొందరు పిల్లలు యాచకులుగా మారటం లేదా బాలకార్మికులుగా పనిచేస్తుంటారు.
దీంతో పాటు ఇంట్లో అలిగి వచ్చిన పిల్లలు రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ఇలా కుటుంబాలను వదిలి వచ్చిన పిల్లలను ఆర్పీఎఫ్ రక్షించి వారిని వారి కుటుంబాలకు తిరిగి అప్పగిస్తుంటారు. వారి కుటుంబ వివరాలు తెలియకుంటే అలాంటి వారిని సంరక్షణ అధికారులకు అప్పగిస్తుంటారు.
గత ఏడాది రైల్వేస్టేషన్లలో 17,112 మంది పిల్లలను రక్షించారు. ఆర్ఫీఎఫ్ రక్షించిన వారిలో బాలురే కాదు బాలికలు కూడా ఉన్నారు. ఇందులో 13,187 మంది పిల్లలు ఇళ్ల నుంచి పారిపోయి రైల్వేస్టేషన్లకు చేరారని వెల్లడైంది. 2,105 మంది పిల్లలు తప్పిపోయారని ఆర్పీఎఫ్ తేల్చింది. ఇందులో 78 మంది బాలురు మానసిక వికలాంగులని, మరో 131 మంది వీధి బాలలని అధికారులు గుర్తించారు. 2024 మొదటి ఐదు నెలల్లో రైల్వే పోలీస్ ఫోర్స్ ఇప్పటికే 4,607 మంది పిల్లలను రక్షించింది.

రైల్వే ఫ్లాట్ ఫాంపై ఛైల్డ్ హెల్ప్ డెస్కలు
మనం సికింద్రాబాద్ రైల్వేస్టేషనులోకి ప్రవేశించగానే ఫస్ట్ ప్లాట్ ఫాం మీదనే ఛైల్డ్ రెస్క్యూ డెస్క్ ఉంటుంది.రైళ్ల ద్వారా మానవ అక్రమ రవాణాను నిరోధించేందుకు బచ్‌పన్ బచావో ఆందోళన్ గా పిలిచే అసోసియేషన్ ఫర్ వాలంటరీ యాక్షన్‌తో రైల్వే ఇటీవల ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది.సికింద్రాబాద్ నగరంతోపాటు 132 ప్రధాన రైల్వేస్టేషన్లలో ఛైల్డ్ హెల్ఫ్ డెస్కులు ఏర్పాటు చేశారు.

సికింద్రాబాద్, ముంబయి, నాగపూర్, షోలాపూర్, పూణే, విశాఖపట్టణం, కోల్ కతా, భువనేశ్వర్, చెన్నై, బెంగళూరు తదితర రైల్వేస్టేషన్లలో కుటుంబాలను వదిలివచ్చిన పిల్లల్ని వారి చెంతకు చేర్చడంతో ఆర్పీఎఫ్ విశేష కృషి చేసిందని సికింద్రాబాద్ కు చెందిన ఓ ఆర్ఫీఎఫ్ ఆఫీసరు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఒక బిడ్డను రక్షించి, వారిని జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగిస్తారు. ఈ ఛైల్డ్ కమిటీ పిల్లలను తల్లిదండ్రులకు అప్పగిస్తుంది.సెంట్రల్ రైల్వేకు చెందిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ గత నాలుగు నెలల్లో ఆపరేషన్ నన్హే ఫరిస్తే కింద రైల్వే ప్లాట్‌ఫారమ్‌ల నుంచి ప్రభుత్వ రైల్వే పోలీసులు మరియు ఇతర ఫ్రంట్‌లైన్ రైల్వే సిబ్బంది సమన్వయంతో 504 మంది పిల్లలను రక్షించారు.


Read More
Next Story