
గుల్జార్ హౌజ్ బాధితులకు రూ 85 లక్షల ఎక్స్ గ్రేషియా
ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి నిధులు మంజూరు
గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాద ఘటనలో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రూ 85 లక్షల ఎక్స్ గ్రేషియా మంజూరు చేసింది. ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఈ మొత్తాన్ని విడుదల చేసినట్టు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారి చేసింది.మే 18న హైదరాబాద్ గుల్జార్ హౌజ్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.
మే 18 తెల్లవారు జామున అగ్ని ప్రమాదం సంభవించడంతో మంటలు ఉవ్వెత్తుగా వ్యాపించాయి. దట్టమైన పొగలు రావడంతో అగ్ని ప్రమాదంలో చిక్కుక్కున్న వారికి ఊపిరాడలేదు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. దీంతో క్షత గ్రాత్రులు ఘటన స్థలిలో, వివిధ ఆస్పత్రులలో చనిపోయినట్టు అధికారులు నిర్దారించారు. ఘటన జరిగిన కొద్ది సేపటికే ప్రధాని నరేంద్ర మోడీ రెండు లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
Next Story