ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఆర్ఎస్‌లో చేరనున్నారా?
x

ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఆర్ఎస్‌లో చేరనున్నారా?

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షడు ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్నిఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.


తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శనివారం బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షడు ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్నిఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తాను ఏపార్టీలో చేరేది వెల్లడించలేదు. అయితే, ఆయన బిఆర్ ఎస్ లో చేరేందుకే బిఎస్ పి రాజీనామా చేసినట్లు సర్వత్రావినబడుతూ ఉంది.

ఈ టాక్ కి వూతమిస్తున్నట్లు ఆయన బిఆర్ ఎస్ అధినేత కెసిఆర్ ను కలుసుకున్నారు. కెసిఆర్ నంది నగర్ నివాసం ఈ సమావేశం జరిగింది. ఇది ప్రవీణ్ కుమార్ చేరిక గురించి చర్చించేందుకే జరిగిన సమావేశమని చెబుతున్నారు.

"పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ముందుకు సాగాల్సిందే. కష్టసుఖాలు పంచుకోవాల్సిందే. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం. నిన్న బీఎస్పీ- బీఆరెస్ పొత్తు వార్త బయటికి వచ్చిన వెంటనే బీజేపీ ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు (కవిత అరెస్టుతో సహా) చేస్తున్నది.బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. నా ఈ ప్రస్థానాన్ని ఆపలేను. రాజీనామా తప్ప మరో మార్గం కనిపించడం లేదు" అని ట్వీట్ లో రాసుకొచ్చారు.

పార్లమెంటు ఎన్నికల వేళ బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా కేసీఆర్ హైదరాబాద్, నాగర్ కర్నూల్ సీట్లు బీఎస్పీకి కేటాయించారు. అయితే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. ఆయన తర్వలోనే బీఆర్ఎస్‌ లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది.


Read More
Next Story