సీఎం రేవంత్‌పై ఆర్ఎస్ ప్రవీణ్ ఫిర్యాదు
రాజ్యాంగానికి సీఎం రేవంత్ రెడ్డి తూట్లు పొడుస్తున్నారని, ఆయన అనాలోచిత నిర్ణయాల వల్ల నిర్వీయం అవుతున్నాయని ఆరోపించారు.
ఫార్ములా ఈ-రేస్ అంశంలో సీఎం రేవంత్ రెడ్డిని అసలు ముద్దాయిగా చేర్చాలని కోరుతూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘రాజ్యాంగానికి సీఎం రేవంత్ రెడ్డి తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్తున్నాయి. రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల నిర్వీయం అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పై క్రిమినల్ కేసు పెట్టాలి’’ అని నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
‘‘ఫార్ములా ఈ కార్ రేసు లో అసలు నిజాలు పక్క దారి పడుతున్నాయి. కేటీఆర్‌పై లేని పోని కేసులు పెడుతున్నారు. ఫార్ములా ఈ కార్ రేసు లో ఏసిబి, ఈడీ విచారణ చేసి ఏం తేల్చలేదు. ఫార్ములా ఈ కార్ రేసు లో ఏలాంటి అవినీతి జరగలేదు. రేవంత్ రెడ్డి అనురాగం తన బందువులపై చూపిస్తున్నాడు. అమెరికా వెళ్లిన రేవంత్ రెడ్డి తన బందువులకు టెండర్లు ఇప్పించుకుంటున్నాడు. కైట్ ఫెస్టివల్, పెట్టీ ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేశారు. కేటీఆర్, పై కాదు రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలి. సెక్షన్ 316 ప్రకారం సియం రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేయాలి. రేవంత్ రెడ్డి పై FIR నమోదు చేసి విచారణ చేయాలి’’ అని ఫిర్యాదులో కోరారు.
ఈడీ విచారణపై కేటీఆర్ ఏమన్నారంటే..
జవనరి 16న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేటీఆర్‌ను విచారించింది. దాదాపు ఏడు గంటల పాటు విచారించింది. హెచ్ఎండీఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీ అంశంపై ఈడీ అధికారులు ఆరా తీశారు. ఎవరి పర్మిషన్ లేకుండా విదేశీ సంస్థకు రూ.45.7 కోట్లు ఎందుకు బదిలీ చేశారు? అంత తొందర ఏమొచ్చిందని అనుమతులు తీసుకోలేదు? అన్న కోణాల్లో ప్రశ్నలు సంధించారు. ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగానే ఈడీ అధికారులు ప్రశ్నించారు. కాగా ఈడీ విచారణ గురించి కేటీఆర్ మాట్లాడుతూ.. తనను కొత్త ప్రశ్నలు ఏమీ అడగలేదని కేటీఆర్ వెల్లడించారు. ఏసీబీ ఏ ప్రశ్నలైతే అడిగిందో అవే ప్రశ్నలను ఈడీ అధికారులు కూడా అడిగారని తెలిపారు. ‘‘నేను లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధం. రేవంత్ రెడ్డి సిద్ధమా. కోర్టులు, జడ్జిలపై నమ్మకం ఉంది. న్యాయమే గెలుస్తుంది. తప్పు చేయలేదు.. చేయబోను. తప్పు చేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.