ఆర్టీసి డ్రైవర్, జర్నలిస్ట్ పై దాడి చేసిన కానిస్టేబుల్ కుటుంబం
x

ఆర్టీసి డ్రైవర్, జర్నలిస్ట్ పై దాడి చేసిన కానిస్టేబుల్ కుటుంబం

కారును ఆర్టీసి బస్సు ఢీకొట్టడంతో ఘర్షణ


నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో ఆర్టీసి బస్సు డ్రైవర్ ను చితకబాదడమే కాకుండా భవానీ దీక్షలో ఉన్న జర్నలిస్ట్ పై దాడి చేసిన విజిలెన్స్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది.

హైదరాబాద్ నుండి నల్గొండకు కానిస్టేబుల్ కుటుంబం ప్రయాణిస్తున్న కారుకు అనుకోకుండా ఆర్టీసిబస్సు(టిఎస్ 05FM0405) ఢీ కొట్టింది. దీంతో కాని స్టేబుల్ కుటుంబ సభ్యులు కారు దిగి డ్రైవర్ క్యాబిన్లో ప్రవేశించి బూతులతో విరుచుకుపడ్డారు.

జర్నలిస్ట్ పై దాడి

దేవి నవరాత్రులు చివరి రోజు కావడంతో అదే బస్సులో భవానీ దీక్ష తీసుకున్న భక్తులు ప్రయాణిస్తున్నారు. ఇందులో ఓ వీడియో జర్నలిస్ట్ కూడా ఉన్నారు. తన వెంట తెచ్చుకున్న వీడియోతో వృత్తిపరంగా డ్రైవర్ మీద జరిగే దాడిని చిత్రీకరించారు. ఈ దృశ్యాన్ని చూసిన కానిస్టేబుల్ భార్య జర్నలిస్ట్ ను దుర్బాషలాడింది. కానిస్టేబుల్ కొడుకు జర్నలిస్ట్ పై చేయి చేసుకున్నాడు. ‘‘పెద్ద పెద్ద పోలీసు అధికారులకు చెప్పుకుంటావో చెప్పుకో మాకేం భయంలేదు’’ అని పొగరుగా జవాబిచ్చాడు. బస్సులో ప్రయాణిస్తున్న భక్తులు టూటౌన్ పోలీస్ స్టేషన్ వెళ్లి కానిస్టేబుల్ కుటుంబం డ్రైవర్, జర్నలిస్ట్ పై జరిగిన దాడి గూర్చి ఫిర్యాదుచేశారు. కానిస్టేబుల్ కుటుంబంపై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read More
Next Story