Tummala Nageswara rao | ‘రైతు భరోసా ఆపేదే లేదు’
x

Tummala Nageswara rao | ‘రైతు భరోసా ఆపేదే లేదు’

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో సంక్షేమ పథకాల అమలు ప్రశ్నార్థకంగా మారింది.


తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో సంక్షేమ పథకాల అమలు ప్రశ్నార్థకంగా మారింది. ఇదంతా ఆలోచించుకునే కాంగ్రెస్ పక్కా ప్రాణాళికతో సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చిందని, ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి కావడంతో ఈ పథకాలన్నీ అటకెక్కడం ఖాయమని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. వీటిలో రైతుభరోసా కూడా ఒకటని, రైతులను మోసం చేయడానికి కాంగ్రెస్ కుట్రలు పన్నుతోందన్న విమర్శలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ ప్రచారాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. ఈ ప్రచారాల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌తో ఇప్పటికే అమలులో ఉన్న పథకాలకు ఎటువంటి సంబంధం లేదని, వాటిపై ఈ షెడ్యూల్ ఎటువంటి ప్రభావం చూపదని స్ఫష్టం చేశారు.

‘‘రైతు భరోసా ఆపేదే లేదు. 34,75,994మందికి రెండు ఎకరాల వరకు 2223.46కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు 37లక్షల ఎకరాలు కు రైతు భరోసా. రుణమాఫీ గత ప్రభుత్వం మొదటి దపా నాలుగు సార్లు 25వేల చొప్పున ఇచ్చింది. బీఆర్‌ఎస్ రైతు బంధు ఇవ్వలేకపోయింది. 40వేల కోట్ల రూపాయలు నేరుగా రైతులకు చేరావేసింది కాంగ్రెస్ సర్కార్. రైతులకు 21వేల రుణమాఫీ, బోనస్, 3వేల కోట్ల భీమా, రైతు భీమా, సబ్సిడీ, విత్తనాలు ఇస్తున్నాం. 10సంవత్సరాల కాలంలో ఎన్నడూ రైతులకు బీ ఆర్ ఎస్ ఏమి చేయకుండా నేడు మాట్లాడడం సిగ్గు చేటు. కేంద్రం సహకరించకున్నా రైతులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూస్తున్నాం’’అని తెలిపారు.

‘‘కేసీఆర్‌కు ఉన్న ఇంతో అంత గౌరవాన్ని కూడా కేటీఆర్ లేకుండా చేస్తుండు. ఆత్మహత్యలు తగ్గిపోయినాయి. అనవసరంగా మాట్లాడి పార్లమెంట్ ఎన్నికల్లో రిజల్ట్స్ ను రిపీట్ చేసుకోకండి. దేశంలో ఎక్కువ వరి దాన్యం పండించింది తెలంగాణ రాష్ట్రం. రెవిన్యూ వాళ్ళు ధరణి నుండి తీసివేయాల్సినవి తీసివేస్తే మరికొంత తగ్గే అవకాశం ఉంది. ల్యాండ్ అక్క్వేషన్, తప్పుడు లెక్కలు,ఒకే నెంబర్ పై రెండు మూడు పాస్ పుస్తకాలు ఉన్నాయి. వచ్చే ఏడాది సాటిలైట్ మ్యాప్ ద్వారా భరోసా, పంట నష్టం ఇస్తాం. నష్టపోయిన ప్రతి రైతుకు భీమా ఇవ్వాలనుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు.

Read More
Next Story