కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట సహస్ర కుటుంబసభ్యులు ఆందోళన
x

కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట సహస్ర కుటుంబసభ్యులు ఆందోళన

హంతకుడు మైనర్ బాలుడు అంటూ పోలీసులు కేసును తప్పుదారి..


తెలంగాణలో సంచలనం సృష్టించిన కూకట్‌పల్లి మైనర్ బాలికను హత్య చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు చేధించినప్పటికీ బాధిత బాలిక కుటుంబ సభ్యుల అగ్రహం చల్లారడం లేదు. పదేళ్ల బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. పక్క బిల్డింగ్ లోనే ఉన్ననిందితుడిని ఐదురోజుల పాటు అరెస్ట్ చేయకుండా పోలీసులు కట్టుకథలు అల్లారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.హంతకుడు మేజర్ అయినప్పటికీ మైనర్‌ అని చెప్పి కఠిన శిక్ష నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. క్రికెట్‌ బ్యాట్‌ కోసం వచ్చి చంపాడని పోలీసులు చెప్పడం సరికాదన్నారు. ఈ నేపథ్యంలోనే బంధువులు, స్థానికులతో కలిసి కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ ముందు జాతీయ రహదారిపై బాలిక తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. తమ కుమార్తెను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని వాళ్లు డిమాండ్‌ చేశారు. అతడిని ఎన్‌కౌంటర్‌లో కాల్చివేయాలని ఆందోళనా కారులు నినాదాలు చేశారు.హంతకుడికి సరైన శిక్ష పడకపోతే తాము వంటిపై పెట్రోల్ పోసుకుని కాల్చుకుని చనిపోతామని సహస్ర తల్లిదండ్రులు హెచ్చరించారు.బాధితుల ఆందోళనతో కూకట్‌పల్లి పీఎస్‌ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. సహస్రను హత్య చేసిన నిందితుడిని ఇప్పటికే జువైనల్ హోంకు తరలించిన సంగతి తెలిసిందే.

Read More
Next Story