కర్నూలు ప్రమాదంపై  సజ్జనార్ పోస్ట్
x

కర్నూలు ప్రమాదంపై సజ్జనార్ పోస్ట్

వాళ్లు టెర్రరిస్టులు, మానవబాంబులు అని సంచలన వ్యాఖ్యలు


కర్నూలు బస్సు ప్రమాదంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పందించారు. సోషల్ మీడియాలోయాక్టివ్ గా ఉండే సజ్జనార్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ‘మద్యం మత్తులో వాహనాలు నడిపి రోడ్లపైకి వచ్చి అమాయక ప్రాణాలను బలిగొన్న వ్యక్తులను టెర్రరిస్టులు, మానవబాంబులు అనకుండా ఇంకేం అంటారు చెప్పండి’ అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఒకరి నిర్లక్ష్యం 20 మంది ప్రాణాలను బలి తీసుకుంది.

మద్యం మత్తులో వాళ్లు చేసిన తప్పిదం వల్ల ఎన్నికుటుంబాలు మానసిక క్షోభ అనుభవిస్తున్నాయి. మీ సరదా, జల్సాల కోసం ఇతరుల ప్రాణాలను బలి తీసుకునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు’ అని ఆయన ప్రశ్నించారు.

‘సమాజంలో మన చుట్టూ ఇలాంటి, టెర్రర్రిస్టులు ఉండనే ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి’ అంటూ ఆయన చేసిన ట్వీట్ ప్రతీ ఒక్కరిని ఆలోచింపచేసింది. ‘వీరి కదలికలపై అనుమానం వస్తే 100 నెంబర్ కు ఫోన్ చేయాలని లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి’ ఆయన సూచించారు. ‘చూస్తూ చూస్తూ వాళ్లను ఇలాగే వదిలేస్తే రోడ్ల మీదకు వచ్చి ఎంతో మందిని చంపేస్తారు’ అని ఆయన అన్నారు. ‘వారిని మాకెందుకు లే అని వదిలేస్తే భారీ ప్రాణ నష్టం వాటిల్లుతుంది’ అని సజ్జనార్ హెచ్చరించారు.

Read More
Next Story