
సౌదీ ప్రమాదం : రెండు కుటుంబాల్లోని 15 మంది మృతి
రెండు వాహనాలు బాగా వేగంతో ప్రయాణిస్తు గుద్దుకోవటంతో ప్రమాదంజరిగి ట్యాంకర్లోని డీజల్ కారణంగా మంటలు మొదలయ్యాయి
సౌదీ అరేబియాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో మరణించిన వారిలో రెండుకుటుంబాలకు చెందిన 15మంది ఉన్నారు. ఈరోజు తెల్లవారుజామున మక్కా(Macca road accident) నుండి మదీనా(Madinah)కు ప్రార్ధనల కోసం వెళుతున్న ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న డీజల్ ట్యాంకర్ ను ఢీకొన్నపుడు ఈ ప్రమాదం జరిగింది. రెండు వాహనాలు బాగా వేగంతో ప్రయాణిస్తున్నపుడు ఢీకొన్నపు ప్రమాదంజరగటంతో ట్యాంకర్లోని డీజల్ కారణంగా మంటలు మొదలయ్యాయి. ట్యాంకర్లోని డీజల్ బస్సుమీద కూడా పడటంతో బస్సుకు కూడా మంటలు అంటుకున్నాయి. అలాగే ప్రమాద తీవ్రత కారణంగా బస్సు ట్యాంకర్లోని ఆయిల్ కూడా బయటకు రావటంతో ఒక్కసారిగా మంటలు లేచి బస్సును చుట్టుముట్టేశాయి. ప్రమాదం జరిగినపుడు ప్రయాణీకులు 44 మంది మంచి నిద్రలో ఉండటంతో ఏమి జరిగిందో తెలుసుకునేలోపే సజీవదహనమయ్యారు. అయితే ఈ ప్రమాదం నుండి బస్సు డ్రైవర్ తో పాటు మహ్మమద్ అబ్దుల్ షోయబ్ అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు.
చనిపోయిన వారిలో 20 మంది మహిళలు, 11 మంది చిన్నపిల్లలుండగా మిగిలిన 11 మంది మగవాళ్ళు. హైదరాబాద్ నుండి ఈనెల 9వ తేదీన 44 మంది మక్కా ట్రావెల్స్, ఫ్లైజోన్ ట్రావెల్స్ ద్వారా సౌదీ అరేబియా చేరుకున్నారు. చనిపోయిన వారిలో అత్యధికులు హైదరాబాదుకు చెందిన వారే. చనిపోయిన వారిలో రెండుకుటుంబాల వాళ్ళు 15మంది ఉన్నట్లు హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. చనిపోయిన వారిలో రెండు కుటుంబాలకు చెందిన 15 మంది ఉన్నట్లు సమాచారం. ఒక కుటుంబానికి చెందిన ఎనిమిదిమంది, మరో కుటుంబానికి చెందిన ఏడుగురు బస్సులో ప్రయాణించారు. ఎనిమిదిమంది కుటుంబసభ్యుల్లో మహమ్మద్ అబ్దుల్ షోయబ్ గాయాలతో బస్సులో నుండి బయటపడగా మిగిలిన ఏడుగురు మరణించారు.
మరణించిన వారి పేర్లు షోయబ్ తండ్రి మహమ్మద్ అబ్దుల్ కదీర్, షోయబ్ తల్లి గౌసియాబేగం, గౌసియా బేగం తండ్రి మహమ్మద్ మౌలానా, రహీమ్ ఉన్నీసా, రెహమత్ బీ, మహమ్మద్ మన్సూర్ తో పాటు మరో బంధువు ఉన్నాడు. అలాగే రెండో కుటుంబానికి చెందిన ఏడుగురూ సజీవదహనమైపోయారు. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీసు కమీషనర్ వీసీ సజ్జనార్ నిర్ధారించారు. రెండో కుటుంబానికి చెందిన ఏడుగురి వివరాలను సేకరించే ప్రయత్నంచేస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ నుండి వెళ్ళిన 44 మందిలో మక్కా దర్శనం తర్వాత నలుగురు మక్కాలోనే ఆగిపోగా మిగిలిన 40 మంది మదీనాకు ప్రయాణమైనట్లు సజ్జనార్ తెలిపారు.

