‘హైదరాబాద్‌కు విజయవాడ దుస్థితి పట్టకూడదనే’.. హైడ్రాపై డిప్యూటీ సీఎం భట్టి..
x

‘హైదరాబాద్‌కు విజయవాడ దుస్థితి పట్టకూడదనే’.. హైడ్రాపై డిప్యూటీ సీఎం భట్టి..

గ్రేటర్ పరిధిలో హైడ్రా చేపడుతున్న కూల్చివేతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ తరాల కోసమే హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు.


గ్రేటర్ పరిధిలో హైడ్రా చేపడుతున్న కూల్చివేతలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ తరాల కోసమే హైడ్రాను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. నగరంలో చెరువులు, కుంటలు లేకపోతే చిన్నపాటి వరద వచ్చిన జనజీవనం అల్లకల్లోలం అవుతుందని, ఇటీవల వచ్చిన వరదల వల్ల విజయవాడకు పట్టిన పరిస్థితే హైదరాబాద్‌కు కూడా వస్తుందని భట్టి విక్రమార్క తెలిపారు. అలాంటి పరిస్థితులు హైదరాబాద్‌కు రాకూడదనే ఈ ఆక్రమణల తొలగించి ఉపక్రమించామని, వరదలతో మనం పడుతున్న కష్టాలను భావితరాలు కూడా పడకూదనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. సదరన్ కాలిఫోర్నియా తెలుగు కమ్యూనిటీ, స్థానిక కాన్సుల్ జనరల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భట్టి విక్రమార్క.. హైడ్రా గురించి ప్రస్తావించి వివరించారు. ఇప్పటికే ఎక్కడపడితే అక్కడ చెరువుల, కుంటలను ఆక్రమించేసి నిర్మాణాలు చేపడుతున్నారని, వీటిని ఇప్పటికైనా ఆపకుంటే భావితరాలు పెను ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. అటువంటి పరిస్థితులు రాకూడదన్న ఉద్దేశంతోనే హైడ్రాను ప్రారంభించామనట్లు చెప్పారు.

ఆ నిర్మాణాలు ప్రాణాంతకం..

‘‘నది గర్భంలో ఇష్టారాజ్యంగా భవనాలు కట్టేస్తున్నారు. ఇది హైదరాబాద్‌కు ప్రాణాంతకమవుతుంది. పేదోళ్లను అడ్డుపెట్టుకుని బిల్డర్ల్ వ్యాపారాలు చేస్తున్నారు. కోట్లకు కోట్లు దండుకుంటున్నారు. ప్రజల ధన, మానప్రాణాలు కాపాడటం ప్రభుత్వం బాధ్యత. ఆస్తులను కాపాడటం కూడా ప్రభుత్వ బాధ్యతే. అందులో భాగంగానే చెరువులను రక్షించడం కోసం, వాటిని ఉన్నవి ఉన్నట్లుగా భవిష్యత్‌తరాలను అందించడానికి తెలంగాణలో చర్యలు చేపట్టాం. ఆక్రమణల వల్ల వందల చెరువలు కనుమరుగయ్యాయి. అటువంటి పరిస్థితి మరే చెరువుకు పట్టకూడదు. అందుకే చెరుు గర్భంలో నిర్మాణాలు జరగకుండా అయినా ఆపాలనేది మా ప్రభుత్వ ఆలోచన. మూసీ నదిలో మళ్ళీ మంచినీరు పాటించడం, మూసీ పరివాహక ప్రాంతంలో పార్కులు తయారు చేయడం ప్రభుత్వ లక్ష్యం’’ అని చెప్పారు. మూసీ నదిని తలుచుకుంటే ముక్కు మూసుకోవాలన్న ఆలోచన కాకుండా.. అందమైన చెరువు గుర్తొచ్చేలా చేస్తామని చెప్పారు. అందుకోసమే మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించామని, దీనిని యుద్ధప్రాతిపదిక పరుగులు పెట్టిస్తున్నామని వివరించారు.

పునరావాస చర్యలు చేపడుతున్నాం

‘‘మూసీ పునర్జీవం కార్యక్రమాన్ని పరుగులు పెట్టిస్తున్నాం. మూసీ నిర్వాసితులకు పూర్తి అవగాహన కల్పించి వారికి పునరావాసం అందించడంపై కూడా ఫోకస్ పెడుతున్నాం. వారికి డబుల్ బెడ్రూం ఇల్లు, వారి పిల్లలకు చదువు అందిస్తాం. వారి ఆరోగ్యాన్ని కాపాడటానికి అన్ని చర్యలు తీసుకుంటాం. వారంతా మంచి వాతావరణంలో జీవించేలా చర్యలు చేపట్టడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. కలుషితమైన మూసీ నదిలో జీవించడం ఎవరికీ మంచిది కాదు. వారందరికీ పరిశుభ్రమైన పరిసరాల్లో పునరావాసం కల్పిస్తాం. అన్ని సౌకర్యాలు అందిస్తాం’’ అని చెప్పారు.

హైదరాబాద్ అంటేనే రాక్స్ అండ్ లేక్స్

‘‘హైదరాబాద్ అంటే రాక్స్, లేక్స్, ఫార్మ్స్. చెరువులు, కుంటల్లో ఇప్పుడు ఇళ్లు కట్టేస్తున్నారు. పేదల పేరిట బిల్డర్లు వ్యాపారాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన ఇళ్లనే కూల్చేస్తున్నాం. ఇంకా బఫర్ జోన్‌పై నిర్ణయం తీసుకోలేదు. మూసీలో కూడా ఇళ్లు కట్టుకున్నారు. అది వారికి, వారి ఆరోగ్యానికి మంచిది కాదు. వారందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు అందిస్తాం. చెరువుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

Read More
Next Story