విజయ్ దేవర కొండపై ఎస్సి ఎస్టీ  కేసు
x

విజయ్ దేవర కొండపై ఎస్సి ఎస్టీ కేసు

గిరిజనులపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో..


నటుడు విజయ్ దేవర కొండపై ఎస్సీ, ఎస్టీ అటాసిటీ కేసు నమోదైంది. రాయదుర్గం పోలీసులకు గిరిజన సంఘం నేత అశోక్ కుమార్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసు నమోదైంది. గత ఏప్రిల్ 26న రెట్రో సినిమా ప్రీ ఈ వెంట్ ఫంక్షన్ జరిగింది. అదే సమయంలో ఇండియా, పాక్ మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

పెహల్గా దాడిలో భారతీయ పర్యాటకులను ఉగ్రవాదులు హత్య చేయడంతో దేవరకొండ రెట్రో సినిమా ప్రీ ఈ వెంట్ లో గిరిజనులపై పరుషంగా మాట్లాడారు. ట్రైబల్స్ కొట్టుకున్నట్టు అని విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది.

ఆ తర్వాత విజయ్ దేవర కొండ సంజాయిషీ ఇచ్చినప్పటికీ వివాదం సద్దుమణగలేదు. తాను గిరిజనులను ఉద్దేశించి అనలేదని వందల ఏళ్ల క్రితం సమూహాల మధ్య పోరాటం జరిగేది. సమూహాల మధ్య జరిగిన ఘర్షణల్లో ట్రైబ్స్ అని వాడినట్టు విజయ్ దేవర కొండ వివరణ ఇచ్చుకున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక హీరోమీద అట్రాసిటీ కేసు నమోదు కావడం ఇదే ప్రథమం.

Read More
Next Story