గాంధీభవన్లో మంత్రుల షెడ్యూల్
x
Gandhi Bhavan and PCC President Bomma

గాంధీభవన్లో మంత్రుల షెడ్యూల్

బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాతే మంత్రులు క్రమం తప్పకుండా ప్రతి వారం గాంధీభవన్ కు రావాలన్న విషయం డిసైడ్ అయ్యింది.


రేపటినుండి మంత్రులు క్యూ కట్టబోతున్నారు. షెడ్యూల్ ప్రకారం మంత్రులు పార్టీ ఆపీసు గాంధీభవన్ కు ఇప్పటివరకు వచ్చింది లేదు. గతంలో కూడా మంత్రులు గాంధీభవన్ కు తమిష్టం ప్రకారం వచ్చారే కాని షెడ్యూల్ ప్రకారం ఎప్పూడు రాలేదు. కాని ఇపుడు మాత్రం ఏ మంత్రి గాందీభవన్ కు ఎప్పుడు రావాలనే షెడ్యూల్ ఫిక్స్ చేశారు. ఆ షెడ్యూల్ ప్రకారమే మంత్రులు గాంధీభవన్ కు క్యూ కట్టబోతున్నారు. మంత్రులను గాంధీభవన్ కు రప్పిస్తున్న ఘనతంతా మహేష్ కే దక్కుతుందనటంలో సందేహంలేదు. బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాతే మంత్రులు క్రమం తప్పకుండా ప్రతి వారం గాంధీభవన్ కు రావాలన్న విషయం డిసైడ్ అయ్యింది.

మంత్రులు గాంధీభవన్ కు వచ్చేట్లుగా చేయాలన్న మహేష్ రిక్వెస్టును రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. మంత్రులు పార్టీ ఆఫీసుకు వస్తే పార్టీ సీనియర్ నేతలు, క్యాడర్ తమ నియోజకవర్గాల్లో సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని మహేష్ చెప్పిన మాటతో రేవంత్ ఏకీభవించారు. అందుకనే ఈమధ్యనే జరిగిన క్యాబినెట్ సమావేశంలో మంత్రులు ఇదే విషయమై రేవంత్ ఆదేశించారు. ప్రతి వారం ఇద్దరు మంత్రులు కచ్చితంగా గాంధీభవన్ కు వెళ్ళాల్సిందే అని రేవంత్ స్పష్టంగా చెప్పారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటలవరకు టైంటేబుల్ ప్రకారం ప్రతివారం ఇద్దరు మంత్రులు పార్టీ ఆపీసులో ఉండాల్సిందే అని రేవంత్ కచ్చితంగా చెప్పారు.



దీనివల్ల పార్టీ-ప్రభుత్వం మధ్య మంచి సయోధ్య ఉంటుందన్న మహేష్ సూచనకు రేవంత్ ఓకే చెప్పారు. ప్రతివారం ఇద్దరు మంత్రులు, నెలకొకసారి రేవంత్ కూడా గాధీభవన్ కు వచ్చేట్లుగా మహేష్ అందరినీ ఒప్పించారు. పార్టీ ఆఫీసుకు మంత్రులు ఎప్పుడెప్పుడు ఎవరెవరు రావాలో కూడా పీసీసీ అధ్యక్షుడే షెడ్యూల్ ప్రిపేర్ చేసి అందరికీ అందించినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. పీసీసీ అధ్యక్షుడు ప్రిపేర్ చేసిన షెడ్యూల్ ప్రకారం ప్రతివారంలో బుధవారం, శుక్రవారం మంత్రులు పార్టీ ఆఫీసులో మూడుగంటల పాటు ఉంటారు.

షెడ్యూల్ బుధవారం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహాతో మొదలు కాబోతోంది. బుధవారం దామోదర్ పార్టీ ఆఫీసుకు వస్తారు. సెప్టెంబర్ 27వ తేదీన పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు హాజరవుతారు. అక్టోబర్ 2వ తేదీన గాంధీజయంతి సందర్భంగా మంత్రుల విజట్ ఉండదు. అక్టోబర్ 4వ తేదీన ఉత్తమ్ కుమార్ రెడ్డి, 9వ తేదీన పొన్నం ప్రభాకర్, 11వ తేదీన సీతక్క, 16వ తేదీన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, 18న కొండా సురేఖ, 23వ తేదీన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, 25వ తేదీన జూపల్లి కృష్ణారావు, 30వ తేదీన తుమ్మల నాగేశ్వరరావు గాంధీభవన్ కు వస్తారని పార్టీ ఆఫీసు ప్రకటించింది. గతంలో చాలామంది పీసీసీ అధ్యక్షులుగా, ముఖ్యమంత్రులుగా పనిచేసినా ఎప్పుడూ మంత్రులకు షెడ్యూల్ ఇచ్చి గాంధీభవన్ కు పిలిపించింది మాత్రమే బొమ్మా మహేష్ కుమార్ గౌడ్ హయాంలో మాత్రమే.

Read More
Next Story