సీఎంఆర్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల కలకలం..
x

సీఎంఆర్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల కలకలం..

మేడ్చల్‌లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల వ్యవహారం కలకలం రేపుతోంది.


మేడ్చల్‌లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల వ్యవహారం కలకలం రేపుతోంది. బాత్‌రూమ్స్‌లో సీక్రెట్ కెమెరాలను అమర్చారని, తమ వీడియోలు చిత్రీకరిస్తున్నారని విద్యార్థినులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కాలేజీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వ్యవహారంపై రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. తమకు న్యాయం చేయాలని, సీక్రెట్ కెమెరాలను అమర్చిన వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. స్టూడెంట్స్ ధర్నా బాట పట్టడంతో తల్లిదండ్రులు అక్కడకు చేరుకుని తమ పిల్లలకు మద్దతు తెలుపుతున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలని, ఒక్క వీడియో కూడా బయటకు వెళ్లకుండా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాలు కూడా విద్యార్థినుల వ్యవహారంగా ఘాటుగా స్పందిస్తోంది.

సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ బాత్‌రూమ్‌లలో సీక్రెట్ కెమెరాలు అమర్చినట్లు విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. తాము స్నానాలు చేస్తున్న వీడియోలను రహస్యంగా చిత్రీకరిస్తున్నారని, వీరిని కఠినంగా శిక్షించాలని విద్యార్థినులు డిమాండ్ చేరస్తున్నారు. ఈ క్రమంలో హాస్టల్‌లో పనిచేసే వంట సిబ్బందిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై కళాశాల యాజమాన్యం వెంటనే స్పందించాలని విద్యార్థినులు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థినుల భద్రతపై యాజమాన్యం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు కాలేజీ దగ్గరకు చేరుకున్నారు. విద్యార్థినులతో మాట్లాడి వారి ఆరోపణలు, అనుమానాలను అడిగి తెలుసుకున్నారు. వాటి ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని, ఒకవేళ వీడియోల చిత్రీకరణ జరిగి ఉంటే ఒక్క వీడియో కూడా బయటకు రాకుండా చూసుకుంటామని, ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read More
Next Story