మోడీ సీఎం, పీఎం అవడానికి కారణం కాంగ్రెస్
x

'మోడీ సీఎం, పీఎం అవడానికి కారణం కాంగ్రెస్'

మోడీ చాయ్ అమ్ముకున్న ఫ్లాట్ ఫార్మ్ ను నిర్మించింది, ఆయన సీఎం, పీఎం కావడానికి స్వేచ్ఛనిచ్చే రాజ్యాంగాన్ని రచించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని సీతక్క అన్నారు.


రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావడం చారిత్రక అవసరం అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. బుధవారం ఆమె ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండల కేంద్రంలో పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలకి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, దేశంలో బీజేపీ ప్రభుత్వాలు పేదప్రజలకు మేలు చేయలేదని మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దేశ భవిష్యత్తు బాగుపడుతుందని, రాహుల్ ని ప్రధానిని చేయడానికి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు.

మోడీ చాయ్ అమ్ముకున్న ఫ్లాట్ ఫమ్ ను కూడా కాంగ్రెస్ నిర్మించింది అని అన్నారు. ఆయన సీఎం, పీఎం కావడానికి స్వేచ్ఛనిచ్చే రాజ్యాంగాన్ని రచించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. రాజ్యాంగాన్ని కూడా మార్చాలని బిజెపి ప్రభుత్వం చూస్తోందని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

"మోడీ చెప్పిన గిన్నెలు కొట్టి, లైట్లు ఏలిగితే కరోనా పోయిందా? ఆకలి తీరిందా? బీజేపీ ఏమీ చేసింది? వనరులన్నీ ఆదాని, అంబానీలకు కట్టబెడుతున్నారు. రాబోయే కాలంలో బిజెపి ప్రభుత్వం ఉంటే ఏ యువకుడికి ప్రభుత్వ ఉద్యోగం రాదు. అంతా ప్రైవేటీకరణ చేశాక గవర్నమెంట్ ఉద్యోగాలు ఎలా వస్తాయి? కాంగ్రెస్ ఉన్నప్పుడు గవర్నమెంట్ కంపెనీలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండేవి. దేశంలో ఎప్పుడైతే బిజెపి వచ్చిందో అప్పటినుండి అన్ని ప్రైవేట్ వాళ్లకు కట్టబెట్టారు. మూడు నెలల ఎన్నికల కోడ్ ఉండడం వలన మన ప్రాంత అభివృద్ధికి నష్టం.

1952 తర్వాత లాంగ్ టైం ఎన్నికల కోడ్ ఈ ఎన్నికలలోనే ఉంది. మేమే వస్తామని ఇప్పుడు మోడీ చెప్పుకున్నట్టే గతంలో కేసీఆర్ చెప్పుకున్నాడు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. సీతారాం నాయక్, ఎంపీ కవిత ఏమీ చేయలేదు, కనీసం గ్రామాలలో కూడా తిరగలేదు. ఇప్పుడు ఓట్ల కోసం వచ్చి ఏదో ఏదో చెప్తున్నారు. వారిని నమ్మకండి. గతంలో మంత్రిగా ఉండి ఏటూరినాగారం ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన పోరిక బలరాం నాయక్ ని ఎంపీగా గెలిపించండి" అని సీతక్క కార్యకర్తలకి పిలుపునిచ్చారు.

Read More
Next Story