హైదరాబాద్ లో  రోడ్డు ప్రమాదం
x
Road accident in Hyderabad

హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం

లాలాపేటలో అదుపుతప్పిన కారు డివైడర్ ను ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదాల నివారణపై ఎంతగానో అవగాహన కల్పిస్తున్నాయి. ఇటీవలె చేవెళ్ల బస్సు ప్రమాదంలో 19 మంది దుర్మరణం చెందిన తర్వాత పాలకులు అలర్ట్ అయ్యారు. ప్రజలకు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు నిర్వహించినా కొంతమంది వాహనదారులు అత్యంత వేగంతో వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆయా ఘటనల్లో వాహనదారులు మృతిచెందుతుండటంతో కుటుంబ సభ్యులకూ దూరం అవుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్‌లో మరో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు పోలీసులు వెల్లడించారు.


లాలాగూడ పీఎస్ పరిధి లాలాపేటలో ఆదివారం ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. అత్యంత వేగంతో వచ్చిన కారుడివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో నలుగురు యువకులు ఉన్నారు. ఈ ఘటనలో ఇద్దరు యువకులు స్పాట్ లోనే చనిపోయారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం చేరవేశారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో గాయపడిన మరో ఇద్దరు యువకులను హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. మృతిచెందిన వారు మల్కాజ్‌గిరికి చెందిన హర్షిత్ రెడ్డి(22), చెంగిచర్లకు చెందిన శివమణి (23)గా గుర్తించారు. నలుగురు స్నేహితులు కీసర నుంచి తార్నాకాకు వెళ్తుండగా ఈఘటన జరిగింది. ప్రమాదం కారణంగా లాలాపేట మెయిన్ రోడ్డుమీద ట్రాఫిక్ స్థంభించింది. రోడ్డుకు అడ్డంగా ఉన్న కారును పోలీసులు పక్కకు పెట్టి రాకపోకలను క్లియర్ చేశారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Read More
Next Story